టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా Google AI Edge Gallery యాప్ ను తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని కొత్త దిశగా ఈ యాప్ తీసుకెళ్తోంది. ఇప్పటి వరకూ ఏఐ ఫీచర్ల కోసం నెట్ అవసరం అనివార్యమయితే, ఈ కొత్త యాప్ ద్వారా ఇంటర్నెట్ అవసరం లేకుండా ఫోన్‌లోనే ఏఐ మోడల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఇమేజ్ క్రియేషన్, కోడ్ జనరేషన్, ప్రశ్నల సమాధానాలు వంటి పనులు చేయొచ్చు. ముఖ్యంగా ఈ యాప్ యూజర్ డేటాను క్లౌడ్‌కు పంపకపోవడం వల్ల ప్రైవసీ పరంగా మరింత సురక్షితంగా ఉంటుంది.
Iran-israel : ఇరాన్ ప్రెసిడెంట్ కు ప్రధాని మోదీ ఫోన్
Google AI Edge Gallery యాప్ లో ఉపయోగించిన Gemma 2B మోడల్ కేవలం 529MB పరిమాణంలో ఉండే కాంపాక్ట్ మోడల్. ఇది ఓపెన్ సోర్స్‌లో అందుబాటులో ఉండి, Apache 2.0 లైసెన్స్‌తో వస్తోంది. ఈ మోడల్ ఒక సెకనుకు సుమారు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. పెద్ద టెక్స్ట్ డేటాను వేగంగా విశ్లేషించి సమాధానాలు ఇవ్వగల సామర్థ్యం దీంట్లో ఉంది. ఈ మోడల్ ద్వారా డాక్యుమెంట్ల విశ్లేషణ, కంటెంట్ క్రియేషన్, స్మార్ట్ రిప్లయ్ వంటి ఫీచర్లు ఆఫ్‌లైన్‌లోనే పొందవచ్చు. పైగా, సర్వర్‌పై ఆధారపడకుండానే వెంటనే ఫలితాలు అందుబాటులోకి రావడం దీని ప్రత్యేకత.
ప్రస్తుతానికి ఈ యాప్ Android వినియోగదారులకు ఓపెన్ సోర్స్‌గా అందుబాటులో ఉంది. త్వరలోనే iOS వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ యాప్‌ను విద్య, వాణిజ్య అవసరాలకే కాకుండా సాధారణ వినియోగదారులు వ్యక్తిగతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్ లేని ప్రాంతాల్లో, పట్టు కొట్టిన వేళ కూడా ఏఐ సేవలు అందుబాటులో ఉండేలా చేయడం ద్వారా గూగుల్ ఒక పెద్ద అడుగు వేసినట్లైంది. ఇది భవిష్యత్ మోబైల్ ఏఐ యాప్స్‌కు మార్గదర్శకంగా నిలవనుంది.