Jio Laptop: జియో ల్యాప్ టాప్ వచ్చేస్తోంది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

దేశవ్యాప్తంగా జియో వినియోగదారులు ఎంతమంది ఉన్నారో అంచనా వేయడం చాలా కష్టం. జియో సంస్థ ఇప్పటికే 4జీ

Published By: HashtagU Telugu Desk
Jio Laptop

Jio Laptop

దేశవ్యాప్తంగా జియో వినియోగదారులు ఎంతమంది ఉన్నారో అంచనా వేయడం చాలా కష్టం. జియో సంస్థ ఇప్పటికే 4జీ ఇంటర్నెట్ సేవలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా జియో ల్యాప్ టాప్ తో మరొక సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉంది జియో సంస్థ. త్వరలోనే భారత్ లోకి ఈ జియో ల్యాప్ టాప్ ను తీసుకురాబోతోంది. ఇకపోతే ఇటీవలే జియో సంస్థ అధినేత అయినా ముఖేష్ అంబానీ అది తక్కువ ధరకే జియో ల్యాప్ టాప్ లను విడుదల చేస్తాము అని ప్రకటించిన విషయం తెలిసిందే.

చెప్పిన విధంగానే మాటలు నిలబెట్టుకోబోతున్నారు ముఖేష్ అంబానీ. జియో ల్యాప్ టాప్ ను 124 డాలర్లు అనగా రూ. 15 వేల ధరకే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా టెక్ వర్గాల నుంచి సమాచారం. గా జియో ల్యాప్ టాప్ ల కోసం రిలయన్స్ సంస్థ ఇప్పటికే మైక్రో ప్రాసెసర్ల తయారీ సంస్థ క్వాల్ కమ్,ఆపరేటింగ్ సిస్టం మైక్రోసాఫ్ట్ లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టం లో అవసరానికి అనుగుణంగా ప్రత్యేకంగా మార్పులను చేసి జియో ఆపరేటింగ్ సిస్టం తో పాటు జియో కు సంబంధించిన కొన్ని రకాల యాప్స్ ను అలాగే ఇతర సదుపాయాలను జియో ల్యాప్ టాప్ లో ముందే ఇన్స్టాల్ చేసి వినియోగదారులకు అందించబోతోంది.

ఆ తర్వాత వినియోగదారులు వారికి అవసరమైన యాప్స్ ను జియో స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని తెలిపింది. కాగా ఈ ల్యాప్ టాప్ యొక్క ధరల అలాగే ప్రత్యేకతల విషయాలపై స్పందించేందుకు జియో వర్గాలు నిరాకరించాయట. ఈ ల్యాప్ టాప్ ల రాకతో జియో మార్కెట్ మరింత వితరిస్తుంది అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

  Last Updated: 03 Oct 2022, 09:51 PM IST