Site icon HashtagU Telugu

WhatsApp Update : వాట్సాప్ యూజర్స్ గుడ్ న్యూస్.. ఇకపై ఒకే వాట్సాప్ ను ఐదు ఫోన్లలో వాడుకోవచ్చట?

Good News For Whatsapp Users.. Now You Can Use The Same Whatsapp On Five Phones..

Good News For Whatsapp Users.. Now You Can Use The Same Whatsapp On Five Phones..

WhatsApp New Updates : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ (WhatsApp) సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ (WhatsApp) సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకురాబోతోంది. మరి ఆ ఫీచర్ ఏంటి? ఆ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది అన్న వివరాల్లోకి వెళితే..

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటి వరకూ వాట్సాప్ ను ఒక ఫోన్లో ఒక అకౌంట్ మాత్రమే వినియోగించుకునే వీలు ఉంది. ఈ ప్రతికూలత వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పుడు మరో కొత్త అప్ డేట్ లో కంపానియన్ మోడ్ ను అందిస్తోంది. అంటే దీని సహాయంత్తో నాలుగు అదనపు డివైజ్ లను లింక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఒక వాట్సాప్ ఖాతా మొత్తం ఐదు ఫోన్లలో వాడుకోవచ్చన్నమాట. గూగుల్ పిక్సల్ వంటి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ వాట్సాప్ కంపానియన్ మోడ్ ను సెటప్ చేసుకోవచ్చు. ఈ మోడ్ ఏంటంటే అనేక పరికరాల్లో ఒకే వాట్సాప్ ఖాతాను వినియోగించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. చాట్‌లు, కాంటాక్ట్ లు, గ్రూప్స్ అన్నీ కూడా ఆయా పరికరాలలో సింక్రనైజ్ అవుతాయి. మీ వాట్సాప్ ఖాతాకు గరిష్టంగా ఐదు పరికరాలను లింక్ చేయవచ్చు.

సెటప్ ప్రక్రియ ఇప్పటికే ఉన్న లింక్డ్ డివైజ్‌ల ఫంక్షన్‌ను పోలి ఉంటుంది. అయితేఈ వాట్సాప్ కంపానియన్ మోడ్ ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూపొందించబడినందున ఆ ప్రక్రియకన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ ఫీచర్ అధికారికంగా ఏప్రిల్ 25, 2023న విడుదల అయ్యింది. మీరు కంపానియన్ మోడ్‌ని సెటప్ చేసే ముందు, మీరు యాప్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్ డేట్ చేయండి. అందుకోసం గూగుల్ స్లే స్టోర్ నుంచి గానీ, ఐఓఎస్ వినియోగదారులు అయితే యాప్ స్టోర్ నుంచి గానీ ఇది డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ వినియోగదారులు వాట్సాప్ వెబ్‌సైట్‌లో కూడా ఏపీకేని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దానిలో ప్రిఫర్డ్ ల్యాంగ్వేజ్ ను ఎంచుకొని కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ నంబర్ ఎంటర్ చేయమని మిమ్మల్ని అడుగుతుంది. అయితే ఆ స్టెప్ ను వదిలేసి, ఓవర్ ఫ్లో మెనూను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న అకౌంట్ ను లింక్ చేయాలనుకుంటే లింక్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్ పై క్లిక్ చేయాలి. ఈ యాప్ లో క్యూఆర్ కోడ్ మీకు కనిపిస్తుంది. కానీ అలా కాకుండా లింక్ విత్ ఫోన్ నంబర్ ఇన్ స్టిడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కూడా చేయొచ్చు.

అందుకోసం మీ సెకండరీ ఫోన్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి, మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు వన్ టైం పాస్ కోడ్ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రెండో ఫోన్లో కూడా మీ కాంటాక్ట్స్ సింక్రనైజ్ అవుతాయి. రెండు ఫోన్‌ల నుంచి సందేశాలను మీరు చూడవచ్చు. కంపానియన్ మోడ్‌తో, మీరు ఒకేసారి ఐదు ఫోన్‌లలో వాట్సాప్ ని ఉపయోగించవచ్చు. సిమ్ కార్డ్ లేకుండా కూడా వాట్సాప్ మీ సెకండరీ ఫోన్‌లో పనిచేస్తుండటం ఇక్కడ విశేషం. మీరు మీ సెకండరీ ఫోన్‌లో వాట్సాప్ అందించే మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలను పంపడం, స్వీకరించడం వంటి అనేక ఫీచర్లను ఆస్వాదించవచ్చు.

Also Read:  Google Contacts : గూగుల్ కాంటాక్ట్స్ ఫీచర్.. ఫోన్ నంబర్ ఉంటే చాలు లొకేషన్ దొరికిపోతుంది