Site icon HashtagU Telugu

WhatsApp Update : వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఒకే వాట్సాప్ లో రెండు అకౌంట్స్‌ యాక్సెస్ చేసుకోవచ్చట?

Good News For Whatsapp Users.. Can You Access Two Accounts In The Same Whatsapp..

Good News For Whatsapp Users.. Can You Access Two Accounts In The Same Whatsapp..

WhatsApp Update : ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ (WhatsApp) సంస్థ. కాగా ఇటీవల మల్టీ అకౌంట్ పేరుతో ఒక కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు విడుదల చేసింది. ఈ స్పెసిఫికేషన్‌తో ఒకే ఆండ్రాయిడ్ మొబైల్‌లో, ఒకే వాట్సాప్ (WhatsApp) యాప్‌లో రెండు అకౌంట్స్ లాగిన్ చేసి యాక్సెస్ చేయవచ్చు.

We’re Now on WhatsApp. Click to Join.

మీకు కావాల్సినప్పుడు ఆ రెండు అకౌంట్లకు సింగిల్ క్లిక్‌తో స్విచ్ కావచ్చు. కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లందరికీ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్ మొబైల్‌లో వాట్సాప్ (WhatsApp) అప్లికేషన్ ఓపెన్ చేయాలి. టాప్‌ రైట్ కార్నర్‌లో ఉన్న త్రీ డాట్స్ ఐకాన్‌ పై క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ ఆప్షన్‌పై నొక్కి అకౌంట్ సెక్షన్‌ పై ట్యాప్ చేయాలి. తర్వాత యాడ్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ప్రస్తుతం లాగిన్ అయి ఉన్న అకౌంట్‌తో పాటు దాని కింద + ఐకాన్‌తో యాడ్ అకౌంట్ ఆప్షన్ మళ్లీ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి..యాడ్ యాన్ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ కింది భాగంలో అగ్రీ అండ్ కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయాలి.

అప్పుడు మీకు ఎంటర్ యువర్ ఫోన్ నంబర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఫోన్ నంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్‌పై నొక్కాలి. ఇస్ థిస్ కరెక్ట్ నంబర్ అని అడుగుతూ ఒక పాప్‌ అప్‌ మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు నెంబర్ చెక్ చేసి కరెక్ట్ అయితే ఎస్ పై క్లిక్ చేయాలి. కొత్త అకౌంట్ నంబర్‌కు వాట్సాప్ (WhatsApp) కంపెనీ ఓటీపీ పంపిస్తుంది. ఆ సిక్స్ డిజిట్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ చేశాక ప్రొఫైల్ ఇన్ఫో యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేశాక కొత్త నంబర్‌తో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఆ కొత్త అకౌంట్ నుంచి చాట్, కాల్స్, స్టేటస్ ఇలా అన్ని ఫీచర్లు యాక్సెస్ చేయవచ్చు..మునుపటి అకౌంట్‌కు తిరిగి లాగిన్ కావడానికి త్రీ డాట్స్ ఐకాన్‌పై క్లిక్ చేసి స్విచ్ అకౌంట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. వేరే అకౌంట్‌కు లాగిన్ కావడానికి మళ్లీ స్విచ్ అకౌంట్స ఆప్షన్‌ ద్వారా సింగిల్ ట్యాప్‌తో స్విచ్ అవ్వచ్చు.

Also Read:  Earthquake: తెల్లవారుజామున భారీ భూకంపం.. భయాందోళనకు గురైన ప్రజలు