Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్‌ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై ఆ సేవలన్ని వాట్సాప్ లోనే!

WhatsApp

WhatsApp

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. నిత్యం ఈ యాప్ ని లక్షలాది మంది వినియోగిస్తూనే ఉన్నారు. అయితే వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. అలా తాజాగా కూడా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. దాంతో త్వరలో చాట్ తో పాటు మీరు వాట్సాప్ ద్వారా బిల్లు చెల్లింపులు కూడా చేయవచ్చట.

2020లో వినియోగదారుల సౌలభ్యం కోసం కంపెనీ యూపీఐ ద్వారా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి చెల్లింపు ఫీచర్‌ ను జోడించింది. ఇప్పుడు వస్తున్న ఈ కొత్త బిల్ చెల్లింపు ఫీచర్ వినియోగదారుల జీవితాలను మరింత సులభతరం చేస్తుందట. ఆండ్రాయిడ్ అథారిటీ బిల్ పేమెంట్ ఫీచర్ APK టియర్‌డౌన్‌ ను కనుగొంది. ఇది ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. ఈ రాబోయే వాట్సాప్ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.3.15 లో రానుంది. అందువల్ల కంపెనీ భారతదేశంలో తన ఆర్థిక సేవలను వీలైనంత త్వరగా విస్తరించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త ఫీచర్‌ ను జోడించిన తర్వాత వినియోగదారులు ఈ వాట్సాప్ అప్లికేషన్ ద్వారా విద్యుత్ బిల్లు, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్, గ్యాస్ బుకింగ్, వాటర్ బిల్లు, పోస్ట్‌పెయిడ్ బిల్లు, అద్దె చెల్లింపు వంటి అన్ని సేవలను పొందవచ్చట. ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అన్న విషయానికి వస్తే.. ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై కంపెనీ ఎటువంటి సమాచారం అందించలేదు. కానీ వీలైనంత తొందరలోనే ఈ సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే గనుక నిజమైతే చాలా రకాల సేవలను వాట్సాప్ ద్వారానే మనం పొందవచ్చు అని చెప్పాలి.