Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో కొత్త ఫీచర్..

Whatsapp New Update

Whatsapp New Update

WhatsApp: వాట్సప్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. త్వరలో మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదేంటంటే.. టెలిగ్రామ్ తరహాలో యానిమేడెట్ ఎమోజీలను వాట్సప్ ప్రవేశపెట్టనుంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు వాట్సప్ యాజమాన్యం తాజాగా ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ వల్ల వాట్సప్ యూజర్లు సరికత్త అనుభూతిని పొందనున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఇది ఉండగా.. అతి త్వరలోనే వాట్సప్‌లో రానుంది.

ఈ ఎమోజీలతో వాట్సప్ యూజర్లు సరికొత్త మెసేజింగ్ అనుభూతిని పొందనున్నారు. ఇప్పటివరకు ఆండ్రాయిత్, ఐఓఎస్ అపరేటింగ్ సిస్టమ్ లు ఇస్తున్న ఎమోజీలు మాత్రం వాట్సప్ లో ఉన్నాయి. సొంతంగా వాట్సప్ ఎమోజీలను తయారుచేయడం లేదు. అయితే త్వరలో వాట్సప్ సొంతంగా ఎమోజీలను తీసుకురానుంది. దీంతో కోసం లొట్టి లైబ్రరీతో భాగస్వామ్యం కానుంది. అలాగే త్వరలో వీడియో మెసేజ్, లాక్ చాట్, డిస్అప్పియర్ మెసేజెస్ అప్డేట్స్‌ను కూడా వాట్సప్ త్వరలో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

వీడియో మెసేజ్ ఫీచర్ విషయానికొస్తే.. యూజర్లు 60 సెకన్ల నిడివి గల వీడియోను రికార్డు చేసి కాంటాక్ట్స్ లోని వారికి షేర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే అవతలి వ్యక్తికి కూడా వీడియో మెసేజ్ కనిపిస్తుంది. ఇక లాక్ చాట్ ఆప్షన్ వల్ల యూజర్లు తమ ప్రైవే్ చాట్ లను లాక్ చేసుకోవచ్చు. మిగతావారెవరూ లాక్ చేసి చాట్ ను చూడేలు. ఇక డిస్‌అప్పియర్ మెసేజెస్ లో కొత్తగా 15 ఆప్షన్లు రానుండగా.. ప్రస్తుతం ఉన్న 24 గంటలు, ఏడు రోజులు, 90 రోజులు అదనంగా చేర్చునున్నారు. త్వరలోన ఈ అప్డేట్స్ అన్ని వాట్సప్‌లో అందుబాటులోకి రానున్నాయి.