Site icon HashtagU Telugu

Instagram: ఆ యూజర్లకు శుభవార్త… ‌అందుబాటులోకి బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్స్‌!

Whatsapp Image 2023 02 17 At 21.48.02

Whatsapp Image 2023 02 17 At 21.48.02

Instagram: తమలోని టాలెంట్‌ను చూపించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. షార్ట్‌ వీడియోలు, బ్లాగులతో పెయిడ్‌ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. మెటా సంస్థకు చెందిన ఈ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ బిలియన్ ప్లస్ డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతోంది. ఇన్‌స్టా తమ కస్టమర్లను అలరించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో కేవలం ఫోటోలు అప్‌లోడ్ చేయడం మాత్రమే కాదు.. కంటెంట్ క్రియేటర్లుగా కూడా మారొచ్చు. అంతేకాకుండా క్రియేటర్లుగా మారిన వాళ్లు ఇన్‌స్టా రీల్స్‌తో డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికోసం తాజాగా ఇన్‌స్టా ఒక మేజర్ ఫీచర్ తీసుకొచ్చిం ది.

ఇన్‌స్టా క్రియేటర్ల కోసం బ్రాడ్‌కాస్టింగ్‌ ఛానెల్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌లో క్రియేటర్లు కొన్ని ఛానెల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. వాటి ద్వారా క్రియేటర్లు వారి అభిమానులు, ఫాలోవర్స్‌తో కాంటాక్ట్ అయ్యేందుకు, వారితో సమాచారం పంచుకునేందుకు వీలుంటుంది. దీనిలో టెక్ట్స్, వీడియో, ఫోటోలు, వాయిస్ నోట్స్ ద్వారా కూడా ముచ్చటించవచ్చు. ఫ్యాన్సు కూడా వారి అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఛానెల్స్ అంటే ఒక రకంగా పబ్లిక్‌ చాట్ అని చెప్పవచ్చు.

ఈ ఛానెల్స్ గురించి సింపుల్‌గా చెప్పాలి అంటే.. టెలిగ్రామ్‌లో ఎలా అయితే పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయో.. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఛానెల్స్ పేరిట పబ్లిక్ చాట్ ఉంటుంది. టెలిగ్రామ్ తరహాలోనే క్రియేటర్లు చేసే ఈ ఛానెల్స్‌‌లో మీరు కూడా జాయిన్ కావచ్చు. అందరు అందులో సమాచారాన్ని పంచుకోవచ్చు. మీకు నచ్చిన మెసేజ్‌కి మాత్రమే మీరు రెస్పాండ్ కావచ్చు. కాకపోతే ఇందులో రిప్లే ఇచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇది జుకరబర్గ్ సహా అమెరికాలో ఉన్న కొందరు క్రియేటర్లకు మాత్రమే టెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించారు. త్వరలోనే అందరు క్రియేటర్ల కోసం ఇది అందుబాటులోకి రానుంది.