Jio Data Booster : రిలయన్స్ జియో తమ కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ వినిపించింది. కేవలం 11 రూపాయలకే 10 జీబీ హైస్పీడ్ ఇంటర్నెట్ డేటాను అందించే బూస్టర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ బూస్టర్ ప్లాన్ ద్వారా లభించే 10 జీబీ ఇంటర్నెట్‌ను 1 గంటలోగా వాడేసుకోవాలి. ఒకవేళ గంటలోగా 10జీబీ డేటాను వాడుకోవడం పూర్తయితే.. 64 కేబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంటుంది. ఇప్పటికే వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లతో కూడిన రీఛార్జ్ ప్లాన్‌ను వాడుతున్న యూజర్లు హైస్పీడ్ డేటా అవసరమై నప్పుడు ఈ డేటా బూస్టర్ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. భారీగా డేటాను ఎంజాయ్ చేయొచ్చు. లార్జ్ ఫైల్స్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, పెద్ద వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవాలని భావించే వాళ్లకు ఈ ప్లాన్(Jio Data Booster) ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read :Tulsi Gabbard : అమెరికా ఇంటెలీజెన్స్ చీఫ్‌గా తులసి.. ఆమె ఎవరు ?
Disney+ HotStar ఉచిత సబ్‌స్క్రిప్షన్
రిలయన్స్ జియోకు చెందిన రూ. 949 ప్రీపెయిడ్ ప్లాన్ గొప్ప ప్రయోజనాలు అందిస్తుంది. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. అన్ లిమిటెడ్ 5జీ డేటా కూడా వస్తుంది. 4G నెట్ వర్క్ అయితే రోజుకు 2జీబీ హై స్పీడ్ డేటా చొప్పున 84 రోజులకు 168 జీబీ హై స్పీడ్ డేట్ లభిస్తుంది. Disney+ HotStar ఓటీటీ మూడు నెలల ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా దక్కుతుంది. జియో సినిమా, జియో క్లౌడ్, జియో టీవీలకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
Also Read :Phone Tapping Case : టేబుల్‌పై గన్ పెట్టి నన్ను బెదిరించారు : ఎమ్మెల్యే వేముల వీరేశం
జియో, ఎయిర్‌టెల్‌కు సవాల్.. స్టార్ లింక్ ఎంట్రీకి రంగం సిద్ధం
భారతదేశ ఇంటర్నెట్, టెలికాం రంగంలోకి అడుగుపెట్టేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ రెడీ అవుతున్నాడు. ఎలాన్ మస్క్‌కు చెందిన ‘‘స్టార్‌లింక్’’ శాటిలైట్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. ఒక వేళ ఎలాన్ మస్క్ ఇండియాలోకి వస్తే జియో, ఎయిర్ టెల్‌కు గట్టి పోటీ ఎదురవడం ఖాయం. భూమికి సమీపంలో ఉన్న కక్ష్యలో వేల సంఖ్యలో స్టార్ లింక్ శాటిలైట్లు ఉన్నాయి. వీటి ద్వారా నేరుగా ఇంటర్నెట్ సేవలను స్టార్ లింక్ అందిస్తుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, ఎడారుల్లో, మహాసముద్రాల్లో, దట్టమైన అడవుల్లో కూడా స్టార్‌లింగ్ ఇంటర్నెట్ సేవల్ని పొందొచ్చు.