Site icon HashtagU Telugu

New iPhone: రూ. 50 వేల కంటే తక్కువ ధరలో యాపిల్ న్యూమోడల్‌ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

Mixcollage 11 Dec 2023 03 07 Pm 9471

Mixcollage 11 Dec 2023 03 07 Pm 9471

మామూలుగా స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరికి యాపిల్ ఫోన్ వినియోగించాలనే కోరిక ఉంటుంది. కానీ వాటి ధరల కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అటువంటి వారి కోసం యాపిల్ ఎప్పటికప్పుడు తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా మంచి మంచి ఐఫోన్ లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే యాపిల్ కంపెనీ తన కస్టమర్ల కోసం త్వరలో తక్కువ ధరకే ఐఫోన్‌ను ప్రవేశపెట్టనుందని సమాచారం. రూ.50,000 కంటే తక్కువ ధరకే ఈ ఐఫోన్ లభ్యం కానుంది. ఈ బడ్జెట్ శ్రేణి ఐఫోన్ అందరికీ బెస్ట్‌ డీల్‌ అవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎప్పుడెప్పుడు ఈ ఐన్‌ఫోన్‌ ఐఫోన్ SE 4 మార్కెట్లోకి వస్తుందోనని ఐఫోన్‌ ప్రియులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. iPhone SE 4 కి సంబంధించి కొంత సమాచారం లీక్ అయింది. ఐఫోన్ SE 4 2024 జనవరి నుంచి మార్చి మధ్యలో విడుదల కావచ్చననే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి, ఐఫోన్ SE 3 ఫీచర్లు, డిజైన్‌లు ప్రజలు ఊహించినంత ప్రజాదరణ పొందలేదు. అయితే, కొత్త మోడల్‌లో డిజైన్ మరియు కొన్ని విషయాలు మారవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఐఫోన్ ధర రూ.50 వేల లోపే ఉండవచ్చని అంచనా. ఇకపోతే ఐఫోన్ SE 4 ఫీచర్ల విషయానికి వస్తే.. ఐఫోన్ SE 4 డిజైన్ ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుందని ఈ లీక్‌లు సూచిస్తున్నాయి.

అంటే దిగువన బటన్‌లు ఉండవు. స్క్రీన్ చుట్టూ విశాలమైన బ్లాక్ బార్‌లు కూడా ఉండవు. స్క్రీన్, బదులుగా ఫుల్‌ బాడీతో ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.ఐఫోన్ SE 4 రూపకల్పన మరింత ఆధునికంగా, మరింత స్మార్ట్‌గా ఉంటుంది. అయితే, మునుపటి ఐఫోన్ మోడల్స్ లాగానే, ఈ ఐఫోన్ SE 4 పైభాగంలో నాచ్ ఉంటుంది. ఈ నాచ్ కెమెరా, సెన్సార్ స్పీకర్ కోసం కూడా స్పెస్‌ ఇచ్చారు. OLED డిస్‌ప్లే మెరుగైన వీడియో, గేమింగ్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఐఫోన్ SE 4 బ్యాటరీ: లీకైన సమాచారం ప్రకారం, ఈ ఐఫోన్ SE 4 బ్యాటరీ ఐఫోన్ 14 బ్యాటరీ వలె ఉంటుంది. ఈ బడ్జెట్ శ్రేణి ఐఫోన్ అందరికీ బెస్ట్‌ డీల్‌ అవుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్పుడెప్పుడు ఈ ఐన్‌ఫోన్‌ ఐఫోన్ SE 4 మార్కెట్లోకి వస్తుందోనని ఐఫోన్‌ ప్రియులు ఆతృతగాఎదురు చూస్తున్నారు.

Exit mobile version