Site icon HashtagU Telugu

Gmail Feature : జీమెయిల్‌ ‘రిప్లై’ సెక్షన్‌లో కొత్త ఫీచర్.. ఏమిటో తెలుసా ?

Gmail Feature

Gmail Feature

Gmail Feature : మీరు జీమెయిల్ వాడుతున్నారా ?  అయితే మీకోసమే ఈ కొత్త అప్‌డేట్ !! జీ మెయిల్​ రిప్లై కోసం చాట్ స్టైల్​ ఇంటర్ఫేస్​‌ను  తీసుకొచ్చేందుకు గూగుల్ యత్నిస్తోంది. మరో మూడు నెలల్లో దీన్ని జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యూజర్లు సులువుగా ఈ-మెయిల్స్​కు రిప్లై ఇచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుంది. మనం ఏదైనా ఈ-మెయిల్‌ను(Gmail Feature) ఓపెన్ చేసినప్పుడు.. దాని కింద రిప్లై బాక్స్ కూడా కనిపిస్తుంది. దీనిలో మన సమాధానాన్ని రాసి పంపిస్తుంటాం. ఈ లుకింగ్ (ఇంటర్ ఫేస్)‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడమే కొత్త ఫీచర్ ప్రత్యేకత అని సమాచారం. ఎలా అంటే.. ఈ-మెయిల్ ‘రిప్లై బాక్స్’ ఇంటర్ ఫేస్‌ ఇకపై  మనకు ‘చాట్ స్టైల్’​లో కనిపిస్తుంది.  ఈ ఫీచర్ ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్​లోనే ఉంది. సాధారణంగానైతే  మనకు వచ్చిన ఈ-మెయిల్​ను తెరవగానే.. దాని కింది భాగంలో రిప్లై/ రిప్లై ఆల్​/ ఫార్వర్డ్​/ ఎమోజీ ఆప్షన్​లు కనిపిస్తాయి. ఇకపై ఈ-మెయిల్​ పైభాగంలోనే ఆప్షన్లన్నీ కనిపిస్తాయి.  ఈ-మెయిల్​ పైభాగంలో  పిల్​-షేప్​ కంటైనర్లు, బటన్స్​, అటాచింగ్ మీడియా, ఎమోజీలు ఉంటాయి.

We’re now on WhatsApp. Click to Join

యూజర్లకు ప్రయోజనాలివీ..

Also Read : Telangana – Rajya Sabha: కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు వీరే.. అధికారిక ప్రకటన నేడే

అన్‌ సబ్‌స్క్రయిబ్ ఆప్షన్

జీమెయిల్ ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉంది. విద్యార్థుల నుంచి బిజినెస్ మ్యాన్ వరకూ అందిరికీ అనివార్యంగా దీనిని వినియోగించాల్సిన పరిస్థితి. స్మార్ట్ ఫోన్ పనిచేయాలన్నా జీమెయిల్ ఉండాల్సిందే. ప్రతి ఆన్ లైన్ ప్రక్రియ ఈ జీమెయిల్ ఆధారంగానే పనిచేస్తుంటుంది. అన్నింటికీ జీమెయిల్ ను ప్రాథమికంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అనేక అనవసర ఈమెయిల్స్ మీ జీమెయిల్ ఇన్ బాక్స్ లోకి వచ్చి పడుతుంటాయి. వాటిల్లో చాలా ప్రమోషనల్ మెయిల్స్ కూడా ఉంటాయి. అటువంటి అనవసర మెయిల్స్ ఇక రాకుండా ఉండాలంటే వచ్చిన మెయిల్ కింద ఉండే రిపోర్ట్ స్పామ్ అండ్ అన్ సబ్ స్క్రైబ్ అనే బటన్ పై ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అయితే జీమెయిల్ ఇప్పుడు ఈ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఓ కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. కేవలం ఒక ఆప్షన్ గా ఉన్న ఈ రిపోర్ట్ స్పామ్ అండ్ అన్‌సబ్‌స్క్రయిబ్ ను రెండు ఆప్షన్లుగా మార్చింది. అంటే రిపోర్ట్ స్పామ్ ఒక ఆప్షన్, అన్‌సబ్‌స్క్రయిబ్ పేరిట మరో ఆప్షన్ కింద విభజించింది. ఒక్క క్లిక్ తో అవాంఛిత మెయిల్స్ రాకుండా చేసుకోవచ్చు.