Gizmore Smart watch: రూ.1,199 కే సరికొత్త స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ మామలుగా లేవుగా?

దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో పాటు స్మార్ట్ వాచ్ ల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నపిల్లల

  • Written By:
  • Publish Date - February 22, 2023 / 07:00 AM IST

దేశవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో పాటు స్మార్ట్ వాచ్ ల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ స్మార్ట్ వాచ్ లపై ఆసక్తిని చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ వాచ్ ల కొనుగోలుదారుల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో పలు రకాల స్మార్ట్ వాచ్ కంపెనీలు మార్కెట్ లోకి కొత్త కొత్త స్మార్ట్ వాచ్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. అయితే తాజాగా మార్కెట్ లోకి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్ వాచ్ కూడా విడుదల అయ్యింది. ఆ వాచ్ లు ఏంటి వాటి ధర ఫీచర్ ల విషయానికి వస్తే..

గిజ్ మోర్ క్లౌడ్.. గిజ్ మోర్ కంపెనీ అత్యంత చవకైన గిజ్ మోర్ క్లౌడ్ అనే మోడల్ స్మార్ట్ వాచ్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ లోని ఫీచర్లు, దాని ధర చూసి ఆశ్చర్యపోతున్నారు. 1.85 ఇంచెస్ డిస్ ప్లే, రొటేటింగ్ క్రౌన్ కంట్రోల్, 500 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంది. ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింక్ సదుపాయం కూడా ఉంది. దీంతో స్మార్ట్ వాచ్ ద్వారానే కాల్ చేయడం, కాల్ రిసీవ్ చేసుకోవడం చేయచ్చు. మ్యూజిక్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ వాచ్ తో మీరు అలెక్సా, సిరి, గూగుల్ కూడా సపోర్ట్ చేస్తుంది. కేలరీ మోనిటర్, స్లీప్ మోనిటర్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, మహిళల కోసం పిరియడ్స్ కాలిక్యూలేటర్ వంటి హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి.

బ్లూటూత్ కాలింగ్ ద్వారా అయితే రెండ్రోజులు, బ్లూటూత్ కాలింగ్ వాడకపోతే వారంపాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఐపీ 67 వాటర్ రెసిస్టెన్స్ తో ఈ వాచ్ వస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ వాచ్ ధర విషయానికి వస్తే.. దీని ధర రూ.1,199 గా ఉంది. ఆఫర్ ముగిసిన తరువాత దీనిని రూ. 1,699 కి విక్రయిస్తారు. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. ఈ స్మార్ట్ వాచ్ పై ఫ్లిప్ కార్ట్ లో అయితే ఈ వాచ్ పై బ్యాంక్ ఆఫర్స్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఎన్నో ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆక్సిస్ బ్యాంక్ కార్డు ఉంటే వారు ఈ స్మార్ట్ వాచ్ పై అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.