ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం ఐక్యూ సంస్థ ఇప్పటికే గతంలో చాలా రకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వాడితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అలాగే ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై ప్రత్యేక తగ్గింపు ధరలను కూడా ప్రకటిస్తోంది. అందులో బాగానే ఇప్పుడు ఐక్యూ 5జీ భారీగా తగ్గింపు ధరను ప్రకటిస్తుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ బ్రాండ్ ఈ ఏడాది మేలో లాంచ్ చేయగా వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది.
డిజైన్ నుంచి ఫీచర్ల వరకు ఈ డివైస్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల సహాయంతో చెల్లింపులు జరిపినా లేదా కస్టమర్ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసి కొనుగోలు చేసినా డిస్కౌంట్ల ప్రయోజనాన్ని పొందవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్లో ఈ డివైజ్ మీరు అందుకోవచ్చు. ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో రూ.12,998 ప్రారంభ ధరతో జాబితా చేశారు. డివైజ్ 4జీబీ ర్యామ్‌తో 128జీబీ వేరియంట్ ధర అందుబాటులో ఉంది. ఈ ఫోన్ కోసం వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డులు లేదా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు సహాయంతో చెల్లించినట్లయితే రూ .1000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది.
బ్యాంక్ ఆఫర్ తర్వాత ఈ ఫోన్ ధర రూ.11,998గా ఉండనుంది. ఇది కాకుండా, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విషయంలో మీరు గరిష్టంగా రూ .12,300 వరకు ఆఫర్ పొందవచ్చు. దీని విలువ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు గ్రీన్, గ్రే రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ ఉన్నాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ఎస్ వోసీ, డ్యూయల్ స్పీకర్లు ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ ఫోన్‌లో 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగా పిక్సెల్ మెయిన్, 2 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సార్ లతో డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.