Gemopai Ryder Super Max electric scooter: రూ.3 వేలకే బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర, ఫీచర్స్ ఇవే?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో వారంలో పదుల

  • Written By:
  • Publish Date - March 3, 2023 / 07:30 AM IST

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో వారంలో పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ బైక్ లు ఒక దానిని మించి మరొకటి మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జెమొపాయ్ కంపెనీ తన సరికొత్త రైడర్ సూపర్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని పరిచయం చేసింది. ఈ స్కూటర్ బేస్ వెర్షన్ కంటే ఇది ఎక్కువ వేగంతో వెళ్తుంది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఈ స్కూటర్ ధర రూ.79,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ BLDC హబ్ మోటర్‌తో పనిచేస్తుంది.

ఈ మోటర్ మాగ్జిమం 2.7kW ఔట్‌పుట్ ఇస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ BLDC హబ్ మోటర్‌తో పనిచేస్తుంది. ఈ మోటర్ మాగ్జిమం 2.7kW ఔట్‌పుట్ ఇస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్.ఈ స్కూటర్ టాప్ స్పీడ్‌ గంటకు 60 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌కి 1.8kW పోర్టబుల్ బ్యాటరీ ఉంది. దీనికి స్మార్ట్ ఛార్జర్ ఇస్తున్నారు.ఈ లిథియం అయాన్ బ్యాటరీకి 3 ఏళ్ల వారంటీ ఉంది. ఈ బ్యాటరీని తొలగించే వీలుంది. ఈ స్కూటర్ బ్యాటరీ 2 గంటల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుందని తెలిపారు. ఈ స్కూటర్‌ని ఎక్కడైనా ఛార్జ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఈ స్కూటర్‌ను జెమొపాయ్ యాప్‌తో కనెక్ట్ చెయ్యవచ్చు. తద్వారా రియల్ టైమ్ మానిటరింగ్, అప్‌డేట్స్ లభిస్తాయి.
యాప్ ద్వారా స్కూటర్ బ్యాటరీ, స్పీడ్ అలర్ట్స్, సర్వీస్ రిమైండర్లను పొందవచ్చు. ఈ స్కూటర్‌కి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

అవి ఎకో, సిటీ, స్పోర్ట్స్. ఈ స్కూటర్‌కి సపోర్ట్ బ్యాక్, సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, యాంటీ థెఫ్ట్ అలారం, కీ-లెస్ ఎంట్రీ ఉన్నాయి. ఇంకా ఈ రైడర్ స్కూటర్‌కి బాటిల్ హోల్డర్, ఆన్ బోర్డ్ ఛార్జర్, డిజిటల్ స్పీడో మీటర్, ట్యూబ్‌లెస్ టైర్, లార్జ్ బూట్ స్పేస్ ఉన్నాయి. ఈ స్కూటర్ 6 రంగుల్లో లభిస్తోంది. అవి జాజ్జీ నియోన్, ఎలక్ట్రిక్ బ్లూ, బ్లేజింగ్ రెడ్, స్పార్క్లింగ్ వైట్, గ్రాఫైట్ గ్రే, ఫ్లోరోసెంట్ ఎల్లో వంటి రంగుల్లో మనకు ఈ స్కూటర్ లభిస్తుంది. ఈ కొత్త రైడర్ సూపర్ మ్యాక్స్ స్కూటర్ మార్చి 10, 2023 నుంచి దేశంలోని అన్ని జెమొపాయ్ షోరూమ్స్‌లో లభిస్తుంది. అయితే ఆసక్తి ఉన్నవారు ఈ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో రూ.2,999కి బుక్ చేసుకోవచ్చు.