Gau App: ఆవుల కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్.. ఎలా ఉపయోగించాలో తెలుసా?

ఫేస్ రికగ్నిషన్ ఈ సౌకర్యాన్ని మనం తరచుగా మొబైల్ ఫోన్ ను అన్ లాక్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం.

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 09:00 AM IST

ఫేస్ రికగ్నిషన్ ఈ సౌకర్యాన్ని మనం తరచుగా మొబైల్ ఫోన్ ను అన్ లాక్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా ఆఫీసులలో కూడా ఈ ఫేస్ రికగ్నిషన్ సౌకర్యాన్ని వినియోగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ ను ఆవుల కోసం రూపొందించారు అహ్మదాబాద్ ఐఏఎం నిపుణులు. గౌ విజన్ యాప్ పేరిట దీనిని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని ఐఐఎం ఫ్యాకల్టీ మెంబర్ అమిత్ గార్గ్ నేతృత్వంలోని నిపుణులు తాజాగా విడుదల చేశారు.

కాగా ఇప్పటికీ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆవుల ఆధారంగా జీవిస్తున్న విషయం తెలిసింది. కొంతమంది అయితే వందల సంఖ్యలో కూడా ఆవులను ఆధారంగా చేసుకుని జీవిస్తూ ఉన్నారు. ఆవులను వ్యవసాయంలో వినియోగించుకోవడం అలాగే పాల ఉత్పత్తులు, వాటి ఎరువు ఇలా చాలా విషయాలకు వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ ఐఐఎం గాయ్ ఆధారిత్ ఉన్నతి ప్రాజెక్టును ఈ ఏడాది జనవరిలో చేపట్టింది. ఆ ప్రాజెక్టు పేరు జిఏయూ.

ఇందులో భాగంగా ఆవుల ముఖాన్ని బట్టి గుర్తించేలా ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగించి గౌ విజన్ యాప్ ను రూపొందించారు. కాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న గోశాలలో ఉన్న వెయ్యి ఆవులను తమ పరిశోధన కోసం ఎంచుకున్నట్టు ఐఐఎం నిపుణులు తెలిపారు. కృత్రిమ మేధ ఆధారంగా ఆ ఆవుల ముఖ కవళికలను నమోదు చేసి వాటికి పేర్లు పెట్టి, ప్రత్యేకంగా ప్రొఫైల్స్ ను తయారు చేశామని వెల్లడించారు. గౌ విజన్ యాప్ తో స్కాన్ చేసినప్పుడు 92 శాతం కచ్చితత్వంతో గుర్తించగలిగిందని తెలిపారు.