టెక్నాలజీ డెవలప్ అవడంతో స్మార్ట్ ఫోన్ ల, వినియోగం అలాగే స్మార్ట్ వాచ్ ల వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. మరి ముఖ్యంగా నేటి కాలంలో యువత స్మార్ట్ వాచ్ ల విషయంలో బాగా ఆసక్తిని కనబరుస్తున్నారు. స్మార్ట్ వాచ్ ల వినియోగం పెరిగిపోవడంతో ఆయా కంపెనీలు రకరకాల ఫీచర్స్ కలిగిన స్మార్ట్ వాచ్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ బ్రాండ్లు కూడా భారతదేశంలో తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో గార్మిన్ అనే సంస్థ భారతదేశంలో కొత్త స్మార్ట్ వాచ్ లను ఆవిష్కరించింది.
గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్, గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్ఓవర్ సోలార్ పేరుతో రెండు మోడళ్లు విడుదల చేసింది. ఇది పూర్తిగా అనలాగ్ వేరియంట్ కాగా దీనిలో జీపీస్ మల్టీస్పోర్ట్ ఫీచర్ ఉంది. గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్, ఇన్‌స్టింక్ట్ క్రాస్ఓవర్ సోలార్ మధ్య ఉన్న తేడా బ్యాటరీ లైఫ్. రెండో మోడల్ సోలార్ పవర్ ను వినియోగించుకొని బ్యాటరీ చార్జ్ చేసుకోగలుగుతుంది. గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్‌ఓవర్, క్రాస్ఓవర్ సోలార్ భారతదేశంలో తాజాగా జనవరి 20 నుంచి అందుబాటులో ఉండనుంది. అమోజాన్, టాటా క్లిక్, టాటా లగ్జరీ, సినర్జైజర్, ఫ్లిప్ కార్ట్, నైకా డాట్ కామ్ వంటి ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో లభ్యం కానుంది.
అలాగే గార్మిన్ బ్రాండ్ స్టోర్, హీలియోస్ వాచ్ స్టోర్, జస్ట్ ఇన్ టైమ్, క్రీడా దుకాణాలలో ఆఫ్ లైన్ లో లభ్యం అవుతుంది. భారతదేశంలో లాంచ్ అయిన గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్ఓవర్ ధర రూ.55,990 కాగా.. గార్మిన్ ఇన్‌స్టింక్ట్ క్రాస్ఓవర్ సోలార్ ధర రూ.61,990 గా ఆ కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జ్ చేస్తే స్మార్ట్‌వాచ్ మోడ్‌లో దాదాపు ఒక నెల వరకూ వస్తుంది. అదే జీపీఎస్ మోడ్‌లో అయితే 110 గంటల వరకు వస్తుంది. సోలార్ మోడల్ లోని స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 70 రోజుల వరకూ బ్యాటరీ వస్తుంది.