In Phoenix : 12 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్. ఈ కొత్త ఫోన్ ఎంతంటే!

జీరో అల్ట్రా (Zero Ultra) పేరుతో తెస్తున్న ఈ 5 జీ ఫోన్ కేవలం 12 నిమిషాల్లోనే 100 శాతం

Published By: HashtagU Telugu Desk
12 Min Charging Zero Ultra In Phoenix

12 Min Charging

అత్యంత వేగంగా ఛార్జింగ్ పూర్తయ్యే సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఇన్ ఫినిక్స్ (In Phoenix) కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. జీరో అల్ట్రా (Zero Ultra) పేరుతో తెస్తున్న ఈ 5 జీ ఫోన్ కేవలం 12 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ నెల 25 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు ప్రారంభించనున్నట్లు ఇన్ ఫినిక్స్ (In Phoenix) కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.29,999 గా కంపెనీ ప్రకటించింది.

ఫోన్ ఫీచర్లు:

☛ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్,
☛ 6.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోల్డ్ డిస్ ప్లే,
☛ ఫింగర్ ప్రింట్ లాక్,
☛ 200 ఎంపీ ప్రైమరీ కెమెరా,
☛ 13 ఎంపీ అల్ట్రా వైడ్,
☛ మరో 2 ఎంపీ డెప్త్ కెమెరా,
☛ ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ,
☛ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్
☛ 180 వాట్ల సామర్థ్యంతో మన దేశంలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫోన్లలో సూపర్ ఫాస్ట్ గా ఛార్జయ్యే ఫోన్ గా జీరో అల్ట్రా (Zero Ultra) నిలిచిపోతుంది.

Also Read:  Hero XPulse 200T 4V: అదిరిపోయే లుక్స్‌తో హీరో మోటోకార్ప్ నుంచి న్యూ బైక్

  Last Updated: 22 Dec 2022, 01:24 PM IST