Site icon HashtagU Telugu

Free YouTube: షావోమి, రెడ్ మీ ఫోన్లు కొంటే.. యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ

Youtube Live

Youtube Live

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల మార్కెట్ లో ఉన్న పోటీ అంతా ఇంతా కాదు. కొనుగోలుదారులను తమ వైపు లాగేందుకు స్మార్ట్ ఫోన్ల కంపెనీలు ఇస్తున్న ఆఫర్లు అన్నీ ఇన్నీ కావు. ఈ క్రమంలో తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ కంపెనీ షావోమీ ప్రత్యేకంగా భారత వినియోగదారుల కోసం ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఫోన్ల మోడళ్లపై యూట్యూబ్‌ ప్రీమియం సభ్యత్వాన్ని 3 నెలలు ఉచితంగా అందిస్తోంది.

ఆఫర్ వర్తించే షావోమి మోడళ్లు..

షావోమి లోని 12 Pro, 11i, 11i హైపర్ ఛార్జ్, 11T Pro మోడళ్ల కొనుగోలుపై 3 నెలలు ఫ్రీ యూట్యూబ్‌ ప్రీమియం వస్తుంది. షావోమి లోని Pad 5 తో పాటు Redmi లోని Note 11 Pro+, Note 11 Pro, Note 11, Note 11T, and Note 11S మోడళ్లపై 2 నెలలు ఫ్రీ యూట్యూబ్‌ ప్రీమియం వస్తుంది. ఈ ఆఫర్‌ 2023 జనవరి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

యూట్యూబ్‌ ప్రీమియం బెనిఫిట్స్

* యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ను విడిగా మనం తీసుకోవాలంటే నెలకు రూ. 129 చెల్లించాలి.
* ఈ ఫోన్లు కొంటే మోడల్ ను బట్టి 2 నుంచి 3 నెలలు ఈ సర్వీస్ ఫ్రీ. అంటే రూ.250 నుంచి 350 దాకా ప్రయోజనం లభిస్తుంది.
* యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు వెబ్‌ సిరీస్‌లు, షోలతో పాటు ప్రత్యేకమైన ఒరిజినల్స్ ఉంటాయి.
* యాడ్స్‌ లేకుండా వీడియోలు చూసుకోవచ్చు.
* యూట్యూబ్‌ యాప్‌ నుంచి బయటకు వచ్చినా బ్యాక్‌గ్రౌండ్‌లో ఆడియో వినొచ్చు.
* డిస్‌ప్లేపై పిక్చర్‌-ఇన్‌-పిక్చర్‌ మోడ్‌లో వీడియోలను చూసుకోవచ్చు.
* యూట్యూబ్‌ మ్యూజిక్‌ కూడా ఫ్రీ.
* ఆఫ్‌లైన్‌లో యూట్యూబ్ వీడియోలను 720P, 1080P వంటి హైరెజల్యూన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.