Site icon HashtagU Telugu

Free Aadhaar Update: ఆధార్ వినియోగదారులకు శుభవార్త.. ఫ్రీ ఆధార్ అప్డేట్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

Mixcollage 14 Jun 2024 03 49 Pm 8602

Mixcollage 14 Jun 2024 03 49 Pm 8602

ఇండియాలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు ఉండడం అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతే కాకుండా ఈ రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రతి ఒక విషయంలో తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. మరి అలాంటి ఆధార్ కార్డు విషయంలో ఏవైనా తప్పులు ఉంటే అప్డేట్ చేసుకోవడం కూడా తప్పనిసరి. అందుకే ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి గతంలో చాలా సార్లు అవకాశాలు ఇస్తూ ఆ గడువుని పెంచుతూ వచ్చింది యూఐడీఏఐ.

యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు లేకుండా తమ ఆధార్ కార్డ్ అప్‌డేట్‌ చేసేందుకు గతంలో ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఆధార్ గడువును పెంచుతూ వచ్చింది. అయితే తాజాగా మరోసారి ఆధార్ గడువును పెంచుతూ ఆధార్ వినియోగదారులకు చక్కటి శుభవార్తను తెలిపింది. సెప్టెంబర్ 14 వరకు గడువు విధించింది. మై ఆధార్ పోర్టల్ లో ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్లైన్లో అప్డేట్ చేసుకుంటే మాత్రం కచ్చితంగా 50 రూపాయలు రుసుము చెల్లించాల్సిందే. సెప్టెంబర్ 14 వరకు యూఐడీఏఐ వెబ్‌సైట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పేరు, అడ్రస్, ఫోటో ఇతర వివరాల వంటి మార్పులను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

అయితే ఫ్రీ ఆధార్ అప్‌డేట్ గడువు తేదీని పొడిగించడం ఇదే మొదటిసారి కాదన్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో కూడా అనేకసార్లు గడువు తేదీలకు పొడిగించింది. డిసెంబర్ 15, 2023 తర్వాత మార్చి 14కి పొడిగించగా, ఆ తర్వాత జూన్ 14కి, ఇప్పుడు సెప్టెంబర్ 14కి పొడిగించింది యూఐడీఏఐ. ఇంతకీ ఆధార్ కార్డును ఫ్రీగా ఎలా అప్డేట్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. ఇందుకోసం మొదట మీ 16 అంకెల ఆధార్ నంబర్‌ని ఉపయోగించి (https://myaadhaar.uidai.gov.in/)కి లాగిన్ అవ్వాలి. తరువాత క్యాప్చా ఎంటర్ చేసి Login using ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ లింక్ చేసిన మొబైల్ నంబర్‌లో అందుకున్న ఓటీపీ కోడ్‌ని ఎంటర్ చేయాలి. మీరు ఇప్పుడు పోర్టల్‌ను యాక్సెస్ చేయగలరు. డాక్యుమెంట్ అప్‌డేట్ ఎంచుకోవాలి. నివాసి ప్రస్తుత వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ డాక్యుమెంట్స్ ఎంచుకుని అవసరమైన ప్రూఫ్ అప్‌లోడ్ చేయాలి. తరువాత Submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్‌డేట్ అభ్యర్థన 14-అంకెల అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) రూపొందించిన తర్వాత మాత్రమే ఆమోదిస్తారు.