Aadhaar Update: ఆధార్ అప్డేట్ ఇంకా చేయలేదా.. దానికి మరో ఐదు రోజులు మాత్రమే?

ఇండియాలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు ఉండడం అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధ

  • Written By:
  • Publish Date - December 9, 2023 / 02:00 PM IST

ఇండియాలో నివసించే ప్రతి ఒక్క భారతీయుడికి ఆధార్ కార్డు ఉండడం అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అన్నది తప్పనిసరిగా ఉంటుంది. ఈ రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. ప్రతి ఒక విషయంలో తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. మరి అలాంటి ఆధార్ కార్డు విషయంలో ఏవైనా తప్పులు ఉంటే అప్డేట్ చేసుకోవడం కూడా తప్పనిసరి. ఎప్పటికప్పుడు UIDAI ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. తాజాగా కూడా మరోసారి ఆధార్ వినియోగదారులకు మరో హెచ్చరికను జారీ చేసింది. అదేమిటంటే ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు ఉచితంగా చేయడానికి UIDAI అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డు హోల్డర్లు ఇప్పుడు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆన్‌లైన్‌లోనే కొన్ని అప్‌డేట్స్ చేసుకోవచ్చు. అయితే ఇందుకు డిసెంబర్ 14 వరకు మాత్రమే అవకాశం ఉంది.

అంటే ఇందుకు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది.. డిజిటల్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా పౌరులకు ఈ అవకాశం కల్పించారు. ఇప్పుడు మై ఆధార్ పోర్టల్‌లో ఉచితంగా ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు. దీని గురించి UIDAI ఇంతకుముందు ఒక ట్వీట్ చేసింది. పౌరులు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్స్‌ను ఆన్‌లైన్‌లో https://myaadhaar.uidai.gov.in సైట్‌లో ఉచితంగా అప్‌లోడ్ చేసి, ఆధార్‌ను రీవ్యాలిడేఏట్ చేయవచ్చని సంస్థ ట్వీట్‌లో తెలిపింది. అయితే ఇందుకు గడువు గతంలోనే ముగిసినా, తర్వాత ఉచిత సేవలు పొందే గడువును చాలాసార్లు పొడిగించారు. అయితే పదేళ్ల క్రితం ఆధార్‌ తీసుకున్నవారు కొన్ని డాక్యుమెంట్స్ సబ్‌మిట్ చేసి వివరాలను అప్‌డేట్ చేయాలని UIDAI గతంలో స్పష్టం చేసింది. ప్రజలు డెమోగ్రఫిక్ వివరాలను అప్‌డేట్ చేస్తే సేవలు త్వరగా, సులభంగా అందించే అవకాశం ఉంటుందని సంస్థ పేర్కొంది.

డిసెంబర్ 14 వరకు మై ఆధార్ పోర్టల్‌లో ఈ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత ఆధార్ సెంటర్స్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కొంత మొత్తం ఫీజు చెల్లించాలి. ఇకపోతే ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసే ప్రాసెస్ ఏంటి అన్న విషయానికి వస్తే… ముందు మైఆధార్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/కి లాగిన్ అవ్వండి. పోర్టల్‌లో ‘డాక్యుమెంట్ అప్‌డేట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ప్రస్తుత వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ మీ వివరాలను ధ్రువీకరించి, మార్చాల్సిన సమాచారాన్ని సెలక్ట్ చేయాలి. అప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ హైపర్‌ లింక్‌కి రీ డైరెక్ట్ అవుతుంది. డ్రాప్‌డౌన్ మెనూ నుంచి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. స్కాన్ చేసిన కాపీలను నిర్ణీత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేసి, వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ ఉచితంగా ఎలా చేయాలో ఈ వీడియో లింక్ (https://youtu.be/1jne0KzFcF8) ద్వారా తెలుసుకోవచ్చు.