Site icon HashtagU Telugu

Foxconn 300 crore LAND : దిమ్మతిరిగే రేటుకు ల్యాండ్ కొన్న ఫాక్స్ కాన్.. ఎక్కడంటే ?

Foxconn 300 Crore Land

Foxconn 300 Crore Land

తైవాన్ కు చెందిన ఐఫోన్ తయారీ దిగ్గజం ఫాక్స్ కాన్ ఇండియాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈక్రమంలోనే రూ. 300 కోట్ల (Foxconn 300 crore LAND) విలువైన భారీ సైట్‌ను కొనుగోలు చేసింది. మరెక్కడో కాదు .. మన సిలికాన్ సిటీ బెంగళూరు శివారులో !! మంగళవారం ఈవిషయాన్ని ఫాక్స్ కాన్ అఫీషియల్ గా ప్రకటించింది. స్టాక్ ఎక్స్చేంజ్ లకు ఈ సమాచారాన్ని అందించింది. బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలోని దేవనహళ్లిలో 1.2 మిలియన్ చదరపు మీటర్ల (13 మిలియన్ చదరపు అడుగులు) ల్యాండ్ కొన్నామని తెలిపింది. ఈ కొనుగోలుకు అవసరమైన రూ. 300 కోట్ల ($37 మిలియన్లు) ఫండ్స్ ను తమ అనుబంధ సంస్థ ” ఫాక్స్‌కాన్ హాన్ హై టెక్నాలజీ ఇండియా మెగా డెవలప్‌మెంట్” చెల్లిస్తోందని పేర్కొంది. కర్నాటకలో ఏర్పాటు చేయబోయే కొత్త ఫ్యాక్టరీలో రూ.5వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని ఫాక్స్‌కాన్ యోచిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టబోయే ప్లాంట్‌లో త్వరలోనే ఐఫోన్‌ల తయారీ మొదలవుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. దీనివల్ల లక్ష ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. అయితే ఇవాళ (బుధవారం ) కర్ణాటక అసెంబ్లీ పోల్స్ జరుగుతున్న టైంలోనే ఈ ప్రకటన బయటికి రావడం గమనార్హం.

ALSO READ : Apple Store Features: ఇండియాలో మొదటి యాపిల్ స్టోర్ విశేషాలు తెలుసా..?

మార్కెట్ వ్యూహం ఇదీ ..

ఫాక్స్‌కాన్ 2019 నుంచే తమిళనాడులోని తమ ప్లాంట్‌లో యాపిల్ హ్యాండ్‌సెట్‌లను తయారుచేస్తోంది. మరో రెండు తైవానీస్ కంపెనీలు విస్ట్రోన్, పెగాట్రాన్ కూడా మన దేశంలో యాపిల్ పరికరాల తయారీ, అసెంబ్లింగ్ చేస్తున్నాయి. ప్రపంచంలో జనాభాపరంగా నంబర్ 1 స్థానంలో ఉన్న భారత్ యాపిల్ కంపెనీకి అతిపెద్ద మార్కెట్. అందుకే రెండు రిటైల్ స్టోర్‌లను ఇండియాలో ఇటీవల ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్ల వినియోగం విషయంలో చైనా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో మన దేశమే ఉంది. ప్రసుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న యాపిల్ ఫోన్లలో .. 7 శాతం ఇండియాలోనే తయారవుతున్నాయి. మరో ఫాక్స్‌కాన్ యూనిట్ వియత్నాంలోని న్ఘే ఆన్ ప్రావిన్స్‌లో 480,000 చదరపు మీటర్ల స్థలాన్ని కొనుగోలు చేసింది.