Whatsapp: వాట్సాప్ యూజర్లను హెచ్చరించిన టెలిగ్రామ్ ఫౌండర్..ఎందుకో తెలుసా..?

టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ వాట్సాప్ యూజర్లను హెచ్చరించారు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ కు దూరంగా ఉండాలంటూ వాట్సాప్ యూజర్లను సూచించాడు.

  • Written By:
  • Publish Date - October 7, 2022 / 12:35 PM IST

టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ వాట్సాప్ యూజర్లను హెచ్చరించారు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ కు దూరంగా ఉండాలంటూ వాట్సాప్ యూజర్లను సూచించాడు. హ్యాకర్లు వాట్సాప్ యూజర్ల ఫోన్లను ఈజీగా హ్యాక్ చేస్తారని…డేటాకూడా యాక్సెస్ చేయగలరని పేర్కొన్నారు. యూజర్లు ఏ మెసేజింగ్ యాప్ ను ఉపయోగించినా సరే..కానీ వాట్సాప్ కు మాత్రం దూరంగా ఉండాలన్నారు. గతంలో కూడా చాలా సార్లు వాట్సాప్ గురించి అప్రమత్తంగా ఉండాలంటూ పావెల్ పేర్కొన్నారు.

పావెల్ దురోవ్ వాట్సాప్ ను ఉటంకిస్తూ వాట్సాప్ సెక్యూరిటీ సమస్యను బహిర్గతం చేసిందన్నారు. వాట్సాప్ వీడియో కాల్ విషయంలో లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగా హ్యాకర్లు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్లోనిరిమోట్ కోడ్ను తెలుసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా హ్యాకర్ల దాడి గురించి హెచ్చరించింది. కాగా పావెల గతంలోనూ చాలా సార్లు వాట్సాప్ గురించి విమర్శించారు. వాట్సాప్ వాడకం ఎప్పటికీ సురక్షితం కాదన్నారు.