Laptop Tips : ఇటీవల కాలంలో వర్క్ ఫ్రం హోంలు పెరిగాయి. ల్యాప్‌టాప్‌ల వినియోగం కూడా పెరిగింది. ఈక్రమంలోనే వాటి మెయింటెనెన్స్ గురించి చాలామంది ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. ప్రత్యేకించి ల్యాప్‌టాప్‌ల బ్యాటరీ గురించి కూడా గూగుల్‌లో పెద్దఎత్తున సెర్చింగ్ జరుగుతోంది. ఈనేపథ్యంలో ల్యాప్‌టాప్ బ్యాటరీల బ్యాకప్‌ను సేవ్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో కావాలి ? సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులను చేసుకోవాలి ? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
We’re now on WhatsApp. Click to Join.
- ప్రతి ల్యాప్‌టాప్‌కు పవర్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీలు ఎలా పని చేస్తున్నాయో అక్కడ తెలుసుకోవచ్చు. ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్‌ని మెరుగుపరచడానికి మీరు ఏ బ్యాటరీ సెట్టింగ్స్ ఆప్షన్లను మార్చాలనేది కూడా తెలుసుకోవచ్చు.
- బ్యాటరీని ఆదా చేయడానికి మీరు హైబర్నేట్ మోడ్ వాడొచ్చు. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ చివరి దశలో ఉన్నప్పుడు, షట్ డౌన్ అయిపోవడానికి ముందు.. ల్యాప్‌టాప్‌ను హైబర్నేట్ మోడ్‌కు మార్చాల్సి ఉంటుంది. మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు.
- ల్యాప్‌టాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న యాప్‌లను క్లోజ్ చేయాలి. ఈ బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేయడం ద్వారా బ్యాటరీ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా మీ ల్యాప్‌టాప్ త్వరగా డిశ్చార్జ్ కాదు.
- బ్యాటరీ హెల్త్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. లేదంటే దాన్ని వీలైనంత త్వరగా మార్చాల్సి వస్తుంది.
- ల్యాప్‌టాప్‌ను పదేపదే ఛార్జింగ్ చేయాల్సి వస్తే ప్రాసెసర్ మీద ప్రభావం పడుతుంది. మదర్ బోర్డు దెబ్బతినే రిస్క్ కూడా(Laptop Tips) ఉంటుంది.