Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ లో మెసేజ్ లు షెడ్యూల్ పెట్టాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టెప్స్‌ ఫాలో అవ్వాల్సిందే?

Mixcollage 01 Dec 2023 06 44 Pm 6935

Mixcollage 01 Dec 2023 06 44 Pm 6935

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. దీంతో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక వినియోగదారుల సంఖ్య పెరుగుతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా యూజర్స్ ని మరింత ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. అలా నెలలో కనీసం నాలుగు ఐదు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్ సంస్థ. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ ఫీచర్ మరేదో కాదు మెసేజ్ షెడ్యూల్ చేయడం. అయితే వాట్సాప్‌ అధికారికంగా ఇలాంటి ఫీచర్‌ను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. కాని థర్డ్‌ పార్టీ యాప్‌ ద్వారా మీరు పంపాలనుకున్న మెసేజ్‌ను షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు అనుకున్న సమయానికి మీరు పంపాలనుకున్న వ్యక్తికి నేరుగా మెసేజ్‌ వెళ్లిపోతుంది. ఇంతకీ వాట్సాప్‌లో ఇలా మెసేజ్‌ షెడ్యూల్‌ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఎలాంటి స్టెప్స్‌ ఫాలో అవ్వాలి? ఇందుకోసం ఏ యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాట్సాప్‌లో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లను పంపించడానికి పలు రకాల థర్డ్‌ పార్టీ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో స్కెడిట్ అనే థార్డ్ పార్ట్‌ యాప్ ఒకటి. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంటుంది.

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి SKEDit యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మీ ఫేస్‌బుక్‌ ఖాతాతో సైన్ఇన్‌ చేయాలి. అనంతరం మీ పేరు, ఇమెయిల్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఇమెయిల్‌కి వెరిఫికేషన్‌ ఇమెయిల్‌ వస్తుంది. ఇమెయిల్‌ను వెరిఫై చేసుకున్న తర్వాత వాట్సాప్‌పై క్లిక్‌ చేసి స్కెడిట్ యాప్‌కు అవసరైన అనుమతులను మంజూరు చేయాలి. అనంతరం మీరు మెసేజ్‌ చేయాలనుకుంటున్న సమయాన్ని ఎంచుకొని షెడ్యూల్‌ చేస్తే సమయానికి మెసేజ్‌ వెళ్లిపోతుంది. ఇక మీరు షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను పంపే ముందు మీ అనుమతి ఇవ్వాలనుకుంటే ఆ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇలా చేస్తే షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను పంపినప్పుడు ముందుగా మీ పర్మిషన్‌ అడుగుతుంది. ఈ విధంగా మీరు అనుకున్న విధంగా వాట్సాప్ లో మెసేజ్లను షెడ్యూల్ చేయవచ్చు. అయితే ఇలా మెసేజ్ షెడ్యూల్ ఫీచర్ ని వాట్సాప్ సంస్థ ఇతర యాప్ ల ద్వారా కాకుండా నేరుగా వాట్సాప్ ద్వారానే పంపించే విధంగా ఒక సరికొత్త ఫీచర ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది.