ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఆధార్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. సిమ్ కార్డ్ నుంచి బస్సు, రైలు టికెట్ కొనుగోలు చేసే వరకు ప్రతి ఒక్క చోట ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకులో ప్రభుత్వ పథకాలు ఉపయోగి పథకాలు ఇలా ఎన్నెన్నో చోట్ల మనం ఆధార్ కార్డుని ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని కొన్ని ప్రదేశాలలో మనం ఆధార్ కార్డు జిరాక్స్ లు కూడా ఇస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు కొందరు కేటుగాళ్లు ఆధార్ కార్డు ని దుర్వినియోగం చేస్తుంటారు.
మన ప్రయేమం లేకుండానే ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తుంటారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? మన ఆధార్ ను ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించారో ఎలా తెలుసుకోవాలి? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకోసం ముందుగా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌పోర్టల్‌లోకి వెళ్లాలి. తర్వాత ఎడమ వైపు కనిపించే మై ఆధార్ ఆప్షన్ లో ఆధార్ సర్వీసెస్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. ఆపై కిందికి స్క్రోల్ చేసి ఆధార్ Authentication హిస్టరీ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే లాగిన్ కోసం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు లాగిన్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా ను ఎంటర్ చేయాలి.
ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఓపెన్ అయ్యే స్క్రీన్‌లో కిందికి స్క్రోల్ చేస్తే Authentication History ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఆల్ ఆప్షన్ ను క్లిక్ చేసి వెంటనే డేట్ ను ఎంపిక చేసుకొని Fetch Authentication History ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో ఆధార్ కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ ఆధార్ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే వివరాలు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తాయి. అప్పుడు మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారు అనే విషయాలను ఈజీగా తెలుసుకోవచ్చు.