Site icon HashtagU Telugu

Instagram: ఇంస్టాలో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసారా లేదో ఈజీగా తెలుసుకోండిలా?

Mixcollage 17 Jun 2024 06 58 Pm 5027

Mixcollage 17 Jun 2024 06 58 Pm 5027

ప్రస్తుత రోజుల్లో ఇంస్టాగ్రామ్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఇంస్టాగ్రామ్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే ఇప్పటికే ఇంస్టాగ్రామ్ సంస్థ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. అయితే చాలామంది ఇంస్టాగ్రామ్ ని వినియోగిస్తున్నప్పటికీ అందులో ఉన్న ఫీచర్ల గురించి అసలు తెలియదు.

వాటిలో బ్లాక్ ఆప్షన్ ఫీచర్ కూడా ఒకటి. అంటే మీ ఇంస్టాగ్రామ్ ఐడిని అవతల వ్యక్తి బ్లాక్ చేశారు లేదో ఎలా తీసుకోవాలో చాలామందికి తెలియదు. మరి ఆ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఇంస్టాలో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారో తెలుసుకోవాలంటే ముందుగా మెసేజెస్‌ సెక్షన్‌ లోకి వెళ్లాలి. అనంతరం సదరు వ్యక్తి ప్రొఫైల్‌ను ఓపెన్‌ చేయాలి. ఒకవేళ ప్రొఫైల్‌ పిక్చర్‌ లేకుండా వారి యూజర్‌ నేమ్‌ కనిపిస్తే వారి పోస్టలును చూడలేకపోతే మీరు బ్లాక్‌ అయినట్లు అర్థం చేసుకోవచ్చు. అలాగే సెర్చ్‌ ఫంక్షన్‌ని ఉపయోగించి కూడా మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు.

సెర్చ్‌లో మీకు వారి ప్రొఫైల్ కనిపించకపోతే బ్లాక్‌ చేసినట్లు అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో ప్రొఫైల్‌ ప్రైవేట్‌గా ఉన్నా ప్రొఫైల్‌ కనిపించదని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని బ్లాక్‌ చేశారనే అనుమానంగా ఉంటే మరో అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్‌ నుంచి సదరు ఐడీని సెర్చ్‌ చేస్తే కనిపిస్తే మిమ్మల్ని బ్లాక్‌ చేసినట్లే అర్థం చేసుకోవాలి. అలాగే బ్రౌజర్‌లో సదరు వ్యక్తి యూజర్ ప్రొఫైల్‌ని instagram.com/usernameతో సర్చ్ చేస్తే పేజీ అందుబాటులో లేదని సందేశం వస్తే మీరు బ్లాక్‌ అయినట్లే. ఇక మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారో లేదో తెలసుకోవాలంటే యూజర్‌​ని మళ్లీ ఫాలో చేసేందుకు ప్రయత్నించాలి. కొన్ని సెకన్ల తర్వాత ఫాలో బటన్ మళ్లీ ఫాలో కు తిరిగి వస్తే.. మిమ్మల్ని బ్లాక్​ చేసారని అర్థం.

Exit mobile version