Nothing Phone (1): నథింగ్ ఫోన్ 1 పై బంపర్ ఆఫర్.. ఎప్పుడు లేని విధంగా భారీ డిస్కౌంట్?

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ స్పెషల్ సేల్‌లో

  • Written By:
  • Publish Date - January 19, 2023 / 07:00 AM IST

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ స్పెషల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీగా ఆఫర్లను ప్రకటిస్తోంది. అయితే మొన్నటి వరకు న్యూ ఇయర్ ఆ తర్వాత సంక్రాంతి పండుగ ఆఫర్ సందర్భంగా ఎన్నో రకాల ఆఫర్లను ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను జనవరి 15న ప్రారంబించింది. కాగా ఈ ఆఫర్ జనవరి 20న ముగుస్తుంది. ఇక స్మార్ట్ ఫోన్ ల ఆఫర్లో భాగంగా ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ పై భారీగా ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్ సంస్థ. వాటిలో నథింగ్ ఫోన్ 1 కూడా ఒకటి. ఈ ఫోన్ వన్ పై భారీ ఆఫర్ తో అతి తక్కువ ధరకే అందిస్తోంది. 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన నథింగ్ ఫోన్ 1 అసలు ధర రూ.39,999 గా ఉంది.

కానీ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో రూ.27,499 కే అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్ సంస్థ. బ్లాక్ కలర్ వేరియంట్‌ పైనే ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంది. ఇక 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల నథింగ్ ఫోన్ అసలు ధర రూ.37,999 కాగా.. అది బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో రూ.25,499కి దిగి వచ్చింది. అంటే రెండు ఫోన్లు దాదాపు రూ.12 వేల వరకు తగ్గింపు ధరలతో లభిస్తున్నాయి. అయితే వీటి ధర ఇంకా తగ్గించుకునేందుకు కొనుగోలుదారులు తమ ఓల్డ్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఫోన్ ఆఫర్ ద్వారా మరింత తగ్గించుకోవచ్చు. అయితే 6 నెలల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్లు ఇంతకూ ముందు ఎన్నడు లేని విధంగా భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఇకపోతే నథింగ్ ఫోన్ వన్ ఫీచర్ ల విషయానికి వస్తే..

నథింగ్ ఫోన్ 1స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్ కలర్ ఇలా రెండు కలర్స్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటోంది. అలాగే డ్యూయల్ 50 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ HD OLED డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది.ఈ స్మార్ట్‌ ఫోన్ మిడ్‌ రేంజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ కాల్ ఆఫ్ డ్యూటీ వంటి హెవీ గేమ్స్ చాలా స్మూత్‌గా, ల్యాగ్ ఫ్రీగా హ్యాండిల్ చేయగలదు. ఈ స్మార్ట్‌ఫోన్ 18 గంటల బ్యాటరీ లైఫ్ ఆఫర్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 30 నిమిషాల్లో 50 శాంతం ఛార్జ్ అవుతుంది. ఈ 4,500mAh బ్యాటరీ సామర్ధ్యము కలిగి ఉండనుంది.