Site icon HashtagU Telugu

POCO C65: పోకో స్మార్ట్ ఫోన్ పై భారీగా డిస్కౌంట్.. ఫీచర్లు మామూలుగా లేవుగా?

Mixcollage 25 Jun 2024 12 07 Pm 2467

Mixcollage 25 Jun 2024 12 07 Pm 2467

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్ లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అయితే వినియోగదారులకు అందరికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా మార్కెట్లోకి విడుదల చేస్తోంది. అలాగే ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ ని అందిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే… పోకో ఎఫ్‌6 స్మార్ట్ ఫోన్‌ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. త్వరలో లాంచ్ చేయనున్న ఈ ఫోన్ కి సంబంధించిన ధర ఫీచర్ల విషయానికి కొస్తే..

1220 పిక్సెల్స్‌తో కూడిన డిస్‌ప్లే ను అందించనున్నారు. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 90 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. కెమెరా విషయానికొస్తే.. పోకో ఎఫ్‌6లో సోనీ IMX882 సెన్సర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్స్‌ ప్రైమరీ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 20 మెగాపిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నట్టు సమాచారం. ఇక ఈ పోకో ఎఫ్‌6 స్మార్ట్ ఫోన్‌ ధర.. 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 25 లోపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో టాప్‌ ఎండ్ మోడల్‌ వెర్షన్‌ ధర రూ. 30 వేలలోపు ఉండవచ్చని అంచనా.

కాగా పోకో ఎఫ్‌6 మోడల్‌కి కొనసాగింపుగా పోకో ఎఫ్‌6 ప్రో మోడల్‌ను కూడా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ ను ఈ ఏడాది చివరి నాటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పోకో ఎఫ్‌5కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ కామర్స్‌ సంస్థలు స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్స్ ప్రకటించడం సర్వసాధారణమైన విషయం. అయితే మొన్నటి వరకు కేవలం ప్రత్యేకంగా సేల్స్‌ ఉన్న సమయంలోనే డిస్కౌంట్స్‌ అందించే వారు. కానీ ప్రస్తుతం సేల్స్‌తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ఫోన్‌పై మంచి డిస్కౌంట్‌ అందిస్తోంది.

తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్‌గా చెప్పవచ్చు. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ పోకోకు చెందిన ఫోన్‌పై ఈ డస్కౌంట్‌ లభిస్తోంది. పోకో సీ65 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఏకంగా 38 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. పోకోసీ65 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ అసలు ధర రూ.10,999 కాగా 38 శాతం డిస్కౌంట్‌ లో భాగంగా రూ. 6,799కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌తో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 6వేలలోనే పొందొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ఫస్ట్‌ పేమెంట్‌ చేస్తే రూ. 50 డిస్కౌంట్‌ పొందొచ్చు.