Iphone 12: ఐఫోన్ 12 రూ. 34 వేలకే సొంతం చేసుకోవచ్చు.. ఎలానో తెలుసా?

స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం మొబైల్ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో సరసమైన ధరలకే స్మార్ట్

Published By: HashtagU Telugu Desk
Iphone 12

Iphone 12

స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం మొబైల్ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో సరసమైన ధరలకే స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ ధరల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో మొబైల్ తయారీ సంస్థలు కూడా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు ఉండే మొబైల్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేసి వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఫోన్ లవర్స్ కి ఐఫోన్ సంస్థ తాజాగా ఒక గుడ్ న్యూస్ తెలిపింది. అదేమిటంటే ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్ ను ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్ ను 15వేల రూపాయల తగ్గింపుతో అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తోంది. కాగా ఐఫోన్ 12 అసలు ధర రూ. 48,9000 కాగా ఈ ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 33,999 కి సొంతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది ఐఫోన్ సంస్థ. పాత ఐఫోన్‌ ఎక్స్చేంజ్‌తో పాటు, క్యాష్‌ బ్యాక్‌లతో ఐఫోన్‌ 12ని ఈ ధరకు సొంతం చేసుకోవచ్చు. కాగా ఐఫోన్‌ 12 ఒరిజినల్‌ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లలో ధర రూ. 59,900 కాగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో భాగంగా రూ. 48,999కి లిస్ట్ చేసింది. అయితే ఫెడరల్‌ బ్యాంక్‌ డెబిట్ లేదా క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ. 1500 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది.

ఇక పాత ఐఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసుకోవడం ద్వారా రూ. 15,000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. వీటన్నింటినీ కలుపితే ఈ ఫోన్‌ను చివరిగా రూ. 33,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఐఫోన్‌ 12 ఫీచర్ ల విషయానికి వస్తే.. 6.1 ఇంచెస్‌ సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఇందులో ఏ14 బ‌యోనిక్ చిప్‌సెట్‌ను ఇందులో అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే 12 మెగాపిక్సెల్‌ ట్రూడెప్త్‌ కెమెరాను అందించారు. ఈ కెమరాతో 4కే డాల్బీ విజ‌న్ హెచ్‌డీఆర్ రికార్డింగ్‌ చేసుకోవచ్చు. ఐఓస్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

  Last Updated: 25 Nov 2022, 06:02 PM IST