ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్ ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సేల్ లో భాగంగా చాలా రకాల స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తూ వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అయితే ఇప్పటికే చాలా స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీఎమ్ఎఫ్ ఫోన్ పై కూడా అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ ఆ డిస్కౌంట్ ఏంటి? ఎంత తగ్గింపు లభిస్తోంది అన్న వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం నథింగ్ బ్రాండ్‌కు చెందిన సీఎమ్‌ఎఫ్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది ఫ్లిప్ కార్ట్.
ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. సీఎమ్‌ఎఫ్ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 19,999 కాగా, సేల్‌లో భాగంగా 20 శాతం డిస్కౌంట్ తో రూ. 15,999 కి లభిస్తోంది. అంటే నాలుగు వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ పై దాదాపు రూ. 6 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.67 ఇంచెస్ తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను కూడా అందించారు. ఎస్‌డీ కార్డు ద్వారా 2 జీబీ వరకు మెమోరీని పెంచుకోవచ్చు.
ఇక కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్స్, 2 మెగా పిక్సెల్స్ కెమెరా సెటప్ తో కూడిన రెయిర్ కెమెరాను కూడా అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగా పిక్సెల్స్ తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 730 5జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.