iPhone 12 Mini: ఫ్లిప్ కార్ట్ సూపర్ ఆఫర్.. ఐఫోన్ 12 మినీపై భారీగా తగ్గింపు?

స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువ మంది ఐఫోన్ ను ఒక్కసారైనా వినియోగించాలి అని అనుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - December 24, 2022 / 07:30 AM IST

స్మార్ట్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువ మంది ఐఫోన్ ను ఒక్కసారైనా వినియోగించాలి అని అనుకుంటూ ఉంటారు. ఐఫోన్ లో వినియోగించాలని కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ వాటి ధరల కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో అటువంటి వారి కోసం ఐఫోన్ సంస్థ వాటి ఫోన్లో పై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. తాజాగా ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా ఐఫోన్‌ 12 పై భారీగా డిస్కౌంట్‌ను అందిస్తోంది. అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌, గ్రేట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌తో 2020లో లాంచ్ ఈ స్మార్ట్ ఫోన్ 64జీబీ వేరియంట్ తో లభిస్తోంది. కాగా దీని ధర విషయానికి వస్తే రూ.59,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం కేవలం రూ.20,999కే కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది ఫ్లిప్కార్ట్ సంస్థ. కాగా ప్రస్తుతం 64 జీబీ ఐఫోన్ 12 మినీ సిరీస్ ధర 35 % డిస్కౌంట్ అనంతరం రూ.38,499గా ఉంది.

ఈ ధర ఇంకా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ అందిస్తోంది. ఫోన్‌ మోడల్ బట్టి, దాని వర్కింగ్ కండిషన్ బట్టి రూ.17,500 వరకు అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. అలా ఈ మొత్తం డిస్కౌంట్‌ అనంతరం ఐఫోన్ 12 మినీ కేవలం రూ.20,999కే లభిస్తోంది. అలాగే కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించుకుని చేసే ట్రాన్సాక్షన్‌పై 10% డిస్కౌంట్ లభిస్తుంది. రూ.5000పైగా చేసే కోటక్ బ్యాంక్ ఈఎంఐ ట్రాన్సాక్షన్‌లపై రూ.1000 వరకు ధర తగ్గుతుంది. అలాగే రూ.5000 పైగా కోటక్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌ లపై రూ.750 వరకు డిస్కౌంట్‌ ను పొందవచ్చు. అదే విధంగా ఫ్లిప్‌ కార్ట్‌ యాక్సిస్ బ్యాంక్ కార్డుపై 5% డిస్కౌంట్ లభిస్తుంది. ఇకపోతే ఐఫోన్ 12 మినీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఐఫోన్ 12 మినీలో కూడా ఉన్నాయి. 5.4 అంగుళాల సూపర్ XDR డిస్‌ప్లే, 64జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌ లతో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తోంది.

ఈ ఫోన్ 12 మినీ 12ఎంపీ డ్యూయల్ రియల్ కెమెరా సెటప్ అందిస్తుంది. 12ఎంపీ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరాని అందిస్తోంది. ఇది నైట్ మోడ్, 4కే డాల్బీ విజన్ హెచ్డీర్ రికార్డింగ్ వంటి ఫీచర్స్‌కి సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు కలుపుకుని ఐఫోన్ 12 మినీ సిరీస్ కొనాలనుకునేవారు ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ ఓపెన్‌ చేసి ఆ తర్వాత అక్కడ ఐఫోన్ 12 మినీ సిరీస్ ఫోన్‌ అని టైప్‌ చేసి సెర్చ్‌ చేయాలి. నచ్చిన కలర్‌, సైజును ఎంచుకోవాలి. ఎక్స్ఛేంజి ఆఫర్‌ను వినియోగించాలని అనుకుంటే బై విత్ ఎక్స్చేంజ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఎక్స్ఛేంజ్‌ చేయాలని అనుకుంటున్న ఓల్ట్‌ ఫోన్‌ వివరాలు సెలక్ట్‌ చేసుకోవాలి. తర్వాత బై నౌ క్లిక్ చేసి పేమెంట్ ప్రాసెస్‌ను పూర్తి చేయాలి. పేమెంట్ చేసేటప్పుడే బ్యాంక్ ఆఫర్స్ వర్తిస్తాయి.