Site icon HashtagU Telugu

Smartphone: ఫ్లిప్‌కార్ట్ లో బంపర్ ఆఫర్స్.. స్మార్ట్ ఫోన్స్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్స్!

Smartphone

Smartphone

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో ప్రస్తుతం అద్భుతమైన ఆఫర్స్ నడుస్తున్నాయి. దసరా, దీపావళి పండుగలు సందర్భంగా చాలా రకాల వాటిపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్ సంస్థ. ఇకపోతే నిన్న మొన్నటి వరకు బిగ్ బిలియన్ డేస్ తో వినియోగదారులను ఆకట్టుకున్న ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇప్పుడు తాజాగా బిగ్ షాపింగ్ ఉత్సవ్ అనే పేరుతో మరో సరికొత్త సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా పలు రకాల స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఇంతకీ ఆ స్మార్ట్ ఫోన్స్ ఏవి? ఎంత డిస్కౌంట్ లభిస్తున్నాయి అన్న వివరాల్లోకి వెళితే..

మోటోరోలా జీ85 5జీ.. ఈ సేల్‌లో లభిస్తున్న బెస్ట్ డీల్స్‌ లో ఇదీ కూడా ఒకటి. ఈ ఫోన్‌ ను సేల్‌ లో భాగంగా కేవలం రూ. 15,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 3డీ పీఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

రియల్ మీ పి1 5జీ.. స్మార్ట్‌ ఫోన్‌పై కూడా కళ్లు చెదిరే డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఈ సేల్‌ లో భాగంగా రూ. 12,999 కె లభిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్‌తో అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 5జీ ప్రాసెసర్‌ తో పని చేస్తుంది.

నథింగ్ ఫోన్ 2ఏ.. ఫోన్ విషయానికి వస్తే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా నథింగ్ ఫోన్‌2ఏ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్‌ను రూ. 20,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో నోటిఫికేషన్ ఇండికేటర్‌ గా పనిచేసే, గ్లిఫ్‌ లైట్ ను అందించారు. అలాగే మంచి నాణ్యతతో కూడిన కెమెరాను కూడా ఇందులో అందించారు.

సాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ.. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ను రూ. 39,999కె సొంతం చేసుకునే అవకాశాన్ని ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. ఈ ఫోన్‌ ఏఐ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ను కూడా అందించారు. ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ తో పని చేస్తుందట.

పోకో ఎం6 5జీ.. తక్కువ బడ్జెట్‌ లో మంచి ఫీచర్ల కోసం చూస్తున్న వారికి ఈ పోకో ఎమ్‌6 బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌ లో భాగంగా ఈ ఫోన్‌ ను కేవలం రూ. 7200 కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ లో ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి.