Site icon HashtagU Telugu

Iphone: యాపిల్ ఐఫోన్ పై భారీగా డిస్కౌంట్.. పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ తో కలిపి ఎంత అంటే?

Iphone

Iphone

ప్రపంచవ్యాప్తంగా యాపిల్ బ్రాండ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మరి ముఖ్యంగా యాపిల్ బ్రాండ్స్ లో ఐఫోన్ ని చాలా మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌ కింద కొత్త పలు ఐఫోన్‌లను ఇండియాలో లాంచ్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. కొత్త సిరీస్ లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంటి ఫోన్ లను పరిచయం చేసింది. కాగా ఈ ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900 ధర వద్ద 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ తో లభిస్తోంది.

ఇది ఇలా ఉంటే ఐఫోన్ 14 మోడల్స్ పై ఇప్పుడు అమెజాన్ ఇండియాలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి.. ఐఫోన్ 14 విషయానికి వస్తే.. 128జి‌బి, 256 జి‌బి, 512జి‌బి మూడు వేరియంట్‌లలో లభిస్తోంది. ఈ మూడు వేరియంట్‌లు ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 128 జి‌బి స్టోరేజ్ వేరియంట్ ను రూ. 2,000 తగ్గింపుతో రూ.77,900 వద్ద లిస్ట్ చేయబడింది. అయితే కేవలం ఇది మాత్రమే కాకుండా ఈ ఫోన్‌తో పాటు హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ pai5 వేల తగ్గింపు కూడా అందిస్తోంది.

ఈ రెండు ఆఫర్లతో ఐఫోన్ 128జి‌బిని రూ.72,900 ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ.89,900 ధర ఉన్న 256 జీబీ మోడల్‌ను రూ.82,900కి, 512 జీబీ మోడల్‌ను రూ.1,02,900కి కొనుగోలు చేయవచ్చు. అయితే ఐఫోన్ 14 కొనుగోలుపై అమెజాన్ ఇండియా లో రూ. 16,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అంటే పాత ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అన్ని ఆఫర్‌లతో ఐఫోన్ 14ని రూ. 20,000 వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్ 12 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో లభిస్తుంది.