Infinix GT 10 Pro: మార్కెట్ లోకి మొదటిసారి హయ్యేస్ట్ కెపాసిటీ స్మార్ట్ ఫోన్.. ఏకంగా 26జీబీతో?

మార్కెట్లోకి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లో వందల రకాల స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. వాడితో

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 06:59 PM IST

మార్కెట్లోకి ఇప్పటికీ ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లో వందల రకాల స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి. వాడితో పాటు నెలలో పదుల సంఖ్యలో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఒకదానిని మించి మరొకటి అద్భుతమైన ఫీచర్లు అతి తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఎక్కువ శాతం స్మార్ట్ ఫోన్ కంపెనీలు స్పెసిఫికేషన్ లు మంచి మంచి ఫీచర్లతోనే మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ లను తీసుకువస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఇన్ఫినిక్స్ కంపెనీ వచ్చే నెలలో మార్కెట్ లోకి ఏకంగా 26జీబీ ర్యామ్‌ కలిగిన హై-ఎండ్ ఫోన్ తీసుకురావడానికి సిద్ధమైంది.

ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో పేరుతో తీసుకొస్తున్న ఈ అప్‌కమింగ్ మొబైల్‌లో 26జీబీ ర్యామ్‌ తో రానుంది. ఇప్పటివరకు ఏ ఫోన్ కూడా ఆ రేంజ్ కెపాసిటీతో మార్కెట్లోకి విడుదల కాలేదు. త్వరలోనే మార్కెట్ లోకి ఎక్స్‌ట్రీమ్‌లీ హై-ఎండ్ ఫోన్‌గా కాబోతోంది. అలాగే ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో డిజైన్ కూడా చాలా స్పెషల్‌గా ఉంటుందని తెలుస్తోంది. నథింగ్ ఫోన్ సిరీస్ మాదిరిగానే ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో ఫోన్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇన్ఫినిక్స్ గేమింగ్ ఫోన్ సిరీస్ కోసం జీటీ బ్రాండింగ్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్ ఎక్కువ ర్యామ్ సామర్థ్యంపై ఫోకస్ చేయొచ్చు. ఈ సిరీస్‌తో కంపెనీ హై ర్యామ్ బాటిల్‌లో అంటే మరింత ర్యామ్‌ని అందించడం ద్వారా ఇతర కంపెనీలతో పోటీ పడవచ్చు. Nubia కంపెనీ ఆల్రెడీ 24జీబీ ర్యామ్ ఫోన్‌తో రికార్డు క్రియేట్ చేసింది. ఈ మొబైల్ చైనా మార్కెట్‌లోనే రిలీజ్ అయింది. ఇతర మార్కెట్లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు.

కాగా ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని సమాచారం. జీటీ 10 ప్రో సూపర్ ఫాస్ట్ 240W వైర్డ్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందట. ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఇండస్ట్రీలో ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన ఫస్ట్ ఫోన్ ఈ కంపెనీ ఇదే అవుతుంది. ఈ టాప్-ఎండ్ వేరియంట్ 26జీబీ ర్యామ్ తో పాటు 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆఫర్ చేస్తుందని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి. ఇన్ఫినిక్స్ ఇప్పటిదాకా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు లాంచ్ చేస్తూ వస్తోంది. త్వరలో తక్కువ ధరలో ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో రిలీజ్ చేసి హై-ఎండ్ టెక్ మార్కెట్లోనూ అడుగు పెట్టనుంది. జీటీ 10 ప్రో ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌తో రావచ్చని మరికొన్ని రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. ఇది హై-ఎండ్ చిప్ కాకపోవడం గమనార్హం. ఫోన్ బ్యాక్‌సైడ్‌లో LED లైట్లు ఉండొచ్చు. ఇది నథింగ్ ఫోన్‌ల వంటి RGB లైటింగ్‌ని ఉపయోగించుకోవచ్చు. Infinix జీటీ 10 ప్రో ధర ఇండియాలో దాదాపు రూ.30,000గా నిర్ణయించే అవకాశం ఉంది.