Site icon HashtagU Telugu

Electric Air Taxi: అందుబాటులోకి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు

Electric Air Taxi

Electric Air Taxi

Electric Air Taxi: ఒకప్పుడు భవిష్యత్తులో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి రానున్నాయన్న వార్త విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఎయిర్ ట్యాక్సీ పరిశ్రమ ఆ వార్తలను నిజం చేస్తోంది. తాజాగా ఈ రంగంలో ఓ కీలక అడుగు పడింది. యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ (VTOL) సామర్థ్యం కలిగిన మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు శ్రీకారం చుట్టింది. కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్‌లో ఉన్న జాబీ ఏవియేషన్ అనే ఎయిర్ టాక్సీ స్టార్టప్ సదరన్ కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌కు మొదటి ఎయిర్ ట్యాక్సీ విమానాన్ని డెలివరీ చేసింది.

ఎయిర్ టాక్సీ సేవల కోసం రూపొందించిన జాబీ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది హెలికాప్టర్లు లేదా విమానాల కంటే తక్కువ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఒక పైలట్ మరియు నలుగురు ప్రయాణీకులకు వెసులుబాటు కల్పిస్తుంది. గరిష్టంగా గంటకు 200 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 మైళ్ల వరకు ప్రయాణించగలదు.

ఈ ఎయిర్ ట్యాక్సీల కోసం అమెరికా వైమానిక దళం జాబి ఏవియేషన్‌తో 131 మిలియన్ల డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వం మొత్తం తొమ్మిది విమానాలను పొందనుంది. వీటిలో మొదటిది తాజాగా డెలివరీ అయింది. కాగా.. ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో సదుపాయం ఉన్న నాసా ఈ విమానంపై పరిశోధనలు చేయనుంది.

ఆర్చర్ ఏవియేషన్ మరియు బీటా టెక్నాలజీస్ వంటి ఇతర ప్రముఖ ఎయిర్ టాక్సీ కంపెనీలు కూడా సైన్యంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఈ సహకారాలు ఎలక్ట్రిక్ నిలువు టేకాఫ్ మరియు ల్యాండింగ్ విమానాల అభివృద్ధి మరియు ధృవీకరణను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. ఎయిర్ టాక్సీ పరిశ్రమకు ఏవియేషన్ మరియు ఆటోమోటివ్ కంపెనీల నుండి కూడా మద్దతు లభిస్తోంది. డెల్టా ఎయిర్ లైన్స్, టయోటా, బోయింగ్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, స్టెల్లాంటిస్ వంటి కంపెనీలు ఈ వినూత్న ఎయిర్ టాక్సీ స్టార్టప్‌లను పెట్టుబడులతో ముందుకు నడిపించడానికి నిధులు మరియు నైపుణ్యాన్ని అందిస్తున్నాయి.

Also Read: Biryani : బిర్యానీ లో జెర్రీ ని చూసి పరుగులు పెట్టిన కస్టమర్..ఎక్కడో తెలుసా..?