Fire-Boltt: ఇది కదా ఆఫర్ అంటే.. రూ.19 వేల స్మార్ట్ వాచ్ కేవలం రూ.1199 కే.. ఎలా అంటే?

ప్రస్తుతం మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ ల వాడకంతో పాటు స్మార్ట్ వాచ్ల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ప్రస్తుతం కొన్ని టెక్ సంస్థలు మ

  • Written By:
  • Publish Date - March 25, 2024 / 07:30 PM IST

ప్రస్తుతం మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ ల వాడకంతో పాటు స్మార్ట్ వాచ్ల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ప్రస్తుతం కొన్ని టెక్ సంస్థలు మార్కెట్లోకి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అలాగే ఈ స్మార్ట్ వాచ్ లపై భారీగా తగ్గింపు ధరలను కూడా ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే ఫైర్ బోల్ట్ సంస్థ కూడా ఒక అద్భుతమైన ఆఫర్ను తీసుకువచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. Fire-Boltt కంపెనీ నుంచి వచ్చిన నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్ వాచ్. ఇది 1.83 అంగుళాలు ఉంది. దీనికి బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉంది.

అలాగే AI వాయిస్ అసిస్టెన్స్ ఉంది. ఇంకా 100 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. IP67 రేటింగ్ ఉంది. అలాగే 240 * 280 పిక్సెల్ హై రిజల్యూషన్ ఉంది.
ఈ స్మార్చ్ వాచ్ గురించి వివరంగా చూస్తే.. 1.83 అంగుళాల HD డిస్‌ప్లే ఉందని చెప్పారు. 46.48mm డిస్‌ప్లే వల్ల ప్రతీదీ చాలా అందంగా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందని తెలిపారు. పైగా దీనికి 280 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉందని అంటున్నారు. ఈ స్మార్ట్ వాచ్‌ని ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే, 8 రోజులు పనిచేస్తుందనీ, అదే బ్లూటూత్ కాలింగ్ సదుపాయం వాడుకుంటే, 5 రోజులు పనిచేస్తుందని వివరించారు. ఈ వాచ్‌ని ఫుల్లుగా ఛార్జ్ చెయ్యడానికి 2 గంటలు పడుతుంది.

చార్జర్ తప్పనిసరిగా 3.7V నుంచి 5V వంటివి అయి ఉండాలి. అడాప్టర్ లేదా ల్యాప్‌టాప్ అవుట్‌పుట్ ద్వారా కూడా ఛార్జ్ చెయ్యవచ్చు. 20 శాతం ఛార్జ్ అవ్వడానికి 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఈ వాచ్‌లో మ్యూజిక్‌ని స్టోర్ చెయ్యలేం. కానీ AI వాయిస్ అసిస్టెంట్ ద్వారా మ్యూజిక్‌ని కంట్రోల్ చెయ్యవచ్చు. వాయిస్ కమాండ్స్ ఇస్తూ పని చేయించుకోవచ్చు. ఈ వాచ్‌లో వాల్యూమ్ కంట్రోల్ లేదు. కానీ కాల్ చేసేటప్పుడు వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో బిల్ట్-ఇన్ స్పీకర్, మైక్రోఫోన్ ఉన్నాయి. అందువల్ల వాచ్ ద్వారా కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. ఈ వాచ్‌లో ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి నోటిఫికేషన్స్ వచ్చేలా చేసుకోవచ్చు.

ఈ వాచ్ ద్వారా ఆరోగ్యాన్ని పరిశీలించవచ్చు. ఇందుకోసం SpO2, హార్ట్ రేట్, స్లీప్, స్పోర్ట్స్ ట్రాకింగ్ ఇలా చాలా సదుపాయాలు ఉన్నాయి. అలాగే ఈ వాచ్‌లో 100 స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి. ఫుట్‌బాల్, క్రికెట్, కబడ్డీ ఇలా చాలా మ్యాచ్‌లను ట్రాక్ చెయ్యవచ్చు. ఈ ప్రొడక్టుతో 1 స్మార్ట్ వాచ్, 1 మాన్యువల్, 1 ఛార్జింగ్ కేబుల్, 1 వారంటీ కార్డు ఇస్తారు. ఈ వాచ్ అసలు ధర రూ.19,999 ఉండగా.. అమెజాన్‌లో దీనిపై 94 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.1199కి అమ్ముతున్నారు. దీనికి 4.2/5 రేటింగ్ ఉంది. ఇప్పటికే దీన్ని దాదాపు 22 వేల మంది కొనుక్కున్నారు.