Site icon HashtagU Telugu

Fire-Boltt Smartwatch: అల్టిమేట్ లుక్ తో అదరగొడుతున్న స్టైన్ లెస్ స్టీల్ స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్స్ ఇవే?

Fire Boltt Smartwatch

Fire Boltt Smartwatch

ఈ మధ్యకాలంలో వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో స్మార్ట్ వాచ్ వినియోగదారులు మంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ వాచ్ లను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అన్ని రకాల కంపెనీలు తమ తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవలే స్మార్ట్ వాచ్ ల బ్రాండ్లలో ప్రపంచంలో నంబర్ బ్రాండ్ గా అవతరించిన ఫైర్ బోల్ట్ తాజాగా మరో కొత్త ఫీచర్డ్ స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఫైర్ బోల్ట్ అల్టిమేట్ అనే పేరుతో స్మార్ట్ వాచ్ ని విడుదల చేసింది. ఇకపోతే స్మార్ట్ వాచ్ ధర ఫీచర్ల విషయానికొస్తే… ఇందులో 1.39 అంగుళాల రౌండ్ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, ఐపీ68 రేటింగ్ లాంటి మంచి మంచి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

కాగా ఈ వాచ్ రెండు స్ట్రాప్ లతో మార్కెట్లోకి వచ్చింది. అందులో ఒకటి లెదర్, మరొకటి మెటాలిక్ స్ట్రాప్. లెదర్ స్ట్రాప్ వాచ్ ధర రూ. 1,799కాగా, మెటాలిక్ వేరియంట్ ధర రూ. 1,999గా ఉంది. కాగా లెదర్ వేరియంట్ బ్లాక్, బ్రౌన్ వంటి కలర్స్ లభించనుంది. అలాగే మెటాలిక్ వేరియంట్ బ్లాక్, సిల్వర్, గోల్డ్ కలర్స్ లో లభించనుంది. బోల్ట్ అధికారిక వెబ్ సైట్ తో పాటు, ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ ఫైర్ బోల్ట్ అల్టిమేట్ స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే… ఫైర్-బోల్ట్ అల్టిమేట్ 240×240 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.39-అంగుళాల హెచ్ డీ రౌండ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్, బ్లూటూత్ 5.0 ఉన్నాయి.

ఇది బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్లకు మద్దతు ఇస్తుంది. స్మార్ట్ వాచ్ ప్రత్యేక డయల్ ప్యాడ్‌కు మద్దతును అందిస్తుంది. కాల్ హిస్టరీని కూడా అందిస్తుంది. స్మార్ట్‌వాచ్‌లో 270 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కాల్ చేయకుండానే ఒక వారం వరకు, కాలింగ్ ఫీచర్‌తో కనీసం మూడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ వాచ్ ఆరోగ్య పర్యవేక్షణ ఫీచర్‌లతో వస్తుంది. ఫైర్-బోల్ట్ అల్టిమేట్ కూడా ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. తాగునీరు, వాతావరణ అప్‌డేట్‌లు, కెమెరా నియంత్రణ, స్మార్ట్ నోటిఫికేషన్‌లు వంటి మరెన్నో రిమైండర్‌లను అందిస్తుంది.