Site icon HashtagU Telugu

Fire boltt gladiator plus: మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ వాచ్.. ధర,ఫీచర్స్ ఇవే?

Fire Boltt Gladiator Plus

Fire Boltt Gladiator Plus

రోజురోజుకి స్మార్ట్ వాచ్ ల వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆయా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా మార్కెట్ లోకి మరో సరికొత్త స్మార్ట్ వాచ్ విడుదల అయింది. ప్రముఖ ఫైర్‌ బోల్ట్‌ సంస్థ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఫైర్‌ బోల్ట్‌ గ్లాడియేటర్‌ ప్లస్‌ పేరుతో ఈ స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది.

స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ డిజైన్‌లోనూ ఈ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఇకపోతేఈ స్మార్ట్‌ వాచ్‌ ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ వాచ్ రూ. 3 వేలు లోపు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫీచర్ల పరంగా ఈ స్మార్ట్‌ వాచ్‌ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ను అందించారు. దీంతో వాచ్‌తో కాల్స్‌ మాట్లాడుకోవచ్చు.ఫైర్‌ బోల్ట్‌ గ్లాడియేటర్‌ ప్లస్‌లో 1.96 ఇంచెస్‌ అమోఎల్ఈడి డిస్‌ప్లేను అందించారు. 410×502 పిక్సెల్‌ల రిజల్యూషన్, 600 నిట్స్ బ్రైట్‌నెస్‌ దీని సొంతం. గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి AI వాయిస్ అసిస్టెంట్‌లకు సపోర్ట్ ఇస్తుంది.

అలాగే ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ సెన్సార్‌, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ వంటి హెల్త్‌ ఫీచర్లు ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 20 రోజుల వరకు పని చేస్తుంది.115 కంటే ఎక్కువ స్పోర్ట్స్‌ మోడ్‌లు, రిమోట్‌ కెమెరా కంట్రోల్‌, అలారం, స్టాప్‌వాచ్‌, వెదర్‌ అప్‌డేట్స్‌, స్మార్ట్ నోటిఫికేషన్స్‌ వంటి మరెన్నో ప్రత్యేక ఫీచర్స్‌ ఈ స్మార్ట్ వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి.