Fire Boltt: మార్కెట్ లోకి ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ లు.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫైర్ బోల్ట్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఫైర్‌ బోల్ట్‌ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల

  • Written By:
  • Publish Date - February 8, 2023 / 07:30 AM IST

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఫైర్ బోల్ట్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఫైర్‌ బోల్ట్‌ కంపెనీ ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ వాచ్ చాలా మార్కెట్ లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ వాచ్ లను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకువస్తోంది. అంతేకాకుండా ఇదివరకు మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ వాచ్ లలో మరిన్ని కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఇది ఇలా ఉంటే ఫైర్‌ బోల్ట్‌ కంపెనీ తాజాగా మార్కెట్లోకి మరొక రెండు స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది.

ఫైర్‌బోల్ట్‌ డాజర్‌, ఫైర్‌బోల్ట్‌ స్టార్‌డస్ట్‌ పేర్లతో ఈ వాచ్‌లను లాంచ్‌ చేసింది. మరి ఈ రెండూ స్మార్ట్ వాచ్ ల ధరలు వాటి ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫైర్ బోల్ట్‌ డాజర్‌ ఫీచర్ లు ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ వాచ్‌లో 1.43 ఇంచెస్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్‌ కాలింగ్‌, కాల్‌ హిస్టరీ, క్విక్‌ డైయిల్‌ పాడ్‌, సింక్‌ కంటాక్ట్స్‌ వంటి ప్రత్యేక ఫీచర్లను అందించారు. ఇందులో 400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు, 15 రోజులపాటు స్టాండ్‌బైతో పని చేస్తుంది. 108 స్పోర్ట్స్‌ మోడ్స్‌తో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌, స్లీప్‌, ఎస్‌పీఓ2, హార్ట్‌ రేట్ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లను అందించారు.

ఇక ఇందులో ఇన్‌బుల్ట్‌గా మైక్‌, స్పీకర్‌ను అందించిన ఈ వాచ్‌లో ఐపీ68 వాటర్‌ రెసిస్టెంట్‌ను అందించారు. ఇక ఈ వాచ్ ధర విషయానికొస్తే ఫైర్‌ బోల్ట్ డాజర్‌ రూ. 3,499 గా ఉంది. ఇకపోతే ఫైర్‌ బోల్ట్‌ స్టార్‌డస్ట్‌ ఫీచర్ లు ధర విషయానికి వస్తే.. ఇందులో 1.95 ఇంచెస్‌ హెచ్‌డీ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్‌ 5.0తో పని చేసే ఈ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్‌, కాల్‌ హిస్టరీ, క్విక్‌ డయిల్‌ ప్యాడ్, సింక్‌ కాంటాక్ట్స్‌ వంటి ఫీచర్లను ఇచ్చారు. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్‌తో కూడిన ఈ వాచ్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌ సపోర్ట్‌ను అందించారు. 5 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది. ఇక ఈ వాచ్‌ ధర విషయానికొస్తే రూ. 2,499 గా ఉంది.