మామూలుగా లాంగ్ జర్నీ చేసినప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పదేపదే ఇంధనాన్ని కొట్టించడం ఎందుకు అనుకున్న వాళ్లు ఫుల్ ట్యాంక్ చేయిస్తూ ఉంటారు. కానీ అలా ఫుల్ టైం చేయించడం మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మామూలుగా కారు ఫ్యూయల్ ట్యాంక్ నిండగానే ఆటోమేటిక్గా సెన్సార్ ద్వారా ప్యూయల్ రావడం ఆగిపోతుంది. కార్ల కంపెనీ మ్యానుఫ్యాక్చర్ లు కావాలనే ఫ్యూయల్ ట్యాంకులు కొంత స్పేస్ ఉండేలా డిజైన్ చేస్తారు.
ఫుల్ ట్యాంకు తర్వాత జర్నీ మొదలు పెట్టగానే కారు కుదుపులకి డీజిల్ లేదా పెట్రోల్ కొంత విస్తరిస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ట్యాంక్ లో పోస్తున్నప్పుడు ఒక ఆవిరి లాంటి పదార్థం పైకి వెళ్తూ ఉంటుంది. కార్ ఫ్యూయల్ ట్యాంక్ లో కూడా పెట్రోల్ లేదా డీజిల్ నుంచి అది కుదుపులకు ఉత్పత్తి అవుతుంది. ఆ ప్రెషర్ ని తట్టుకోవడానికి ఫుల్ ట్యాంక్ తర్వాత కూడా కొంత గ్యాప్ ఉంచుతాయి కార్ల కంపెనీలు.కానీ మనం ఆ స్పేస్ ని కూడా ఫీల్ తో ఫిల్ అప్ చేయడం ద్వారా పెట్రోల్ ట్యాంక్ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది.
కొన్నిసార్లు ఫ్యూయల్ ట్యాంక్ లీకులు పడడం, ఫ్యూయల్ పైపులు లీక్ అవడం, ఇంజన్ లో కూడా రిపేర్లు రావడం జరుగుతాయి. ఎక్కడైనా కారు చిన్న ప్రమాదానికి గురైన ఈ ఒత్తిడితో పెట్రోల్ ట్యాంక్ పేలిపోతుంది. కారు జీవితకాలం ఇలా పూర్తిగా ఫ్యూయల్ నింపడం ద్వారా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది బైకులకు కూడా వర్తిస్తుంది. అయితే కారులకు జరిగినంత ప్రమాదం జరగకపోయినా బైక్ ఇంజన్ పాడయ్యే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందంటున్నారు టెక్ నిపుణులు. కాబట్టి ఇంకొకసారి పెట్రోల్ బంక్ లో ఈ ఫుల్ ట్యాంక్ మిస్టేక్ చేయకూడదని చెబుతున్నారు.