Site icon HashtagU Telugu

Old Phone – Selling Tips : పాత ఫోన్ అమ్మేస్తున్నారా ? ఈ జాగ్రత్తలు మస్ట్

Old Phone Selling Tips

Old Phone Selling Tips

Old Phone – Selling Tips : మనం కొత్త ఫోన్‌ను కొనాలని భావిస్తే.. పాత ఫోన్‌ను ఎవరికైనా అమ్మేయాలని చూస్తుంటాం. అయితే ఈ తొందరపాటులో చాలా ముఖ్యమైన విషయాలను మర్చిపోతుంటాం. కీలకమైన మన సమాచారాన్ని పాత ఫోన్‌లోనే వదిలేస్తుంటాం. వాటివల్ల భవిష్యత్తులో మనం ఎన్నో రకాల రిస్క్‌లను ఎదుర్కోవాల్సి రావచ్చు.  ఇంతకీ పాత ఫోన్‌ను అమ్మేటప్పుడు మనం చేసే తప్పులేంటి ? వాటిని ఎలా అధిగమించాలి ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

  1. మీ పాత ఫోన్‌లో ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే.. అందులో సేవ్ చేసిన మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. కానీ మీ గూగుల్ అకౌంట్ నుంచి లాగ్ అవుట్ జరగదు. అందుకే ఫ్యాక్టరీ రీసెట్‌ ప్రక్రియను ప్రారంభించడానికి ముందే.. అన్ని గూగుల్ అకౌంట్లు, ఇతర ఆన్‌లైన్ అకౌంట్ల నుంచి మీరు మ్యానువల్‌గా లాగ్ అవుట్ అయిపోండి. మీరు ఫోన్ సెట్టింగ్స్​లో ‘accounts’ కోసం సెర్చ్ చేసి లాగిన్ చేసిన అకౌంట్ల వివరాలను తెలుసుకోవచ్చు. జీమెయిల్ సెట్టింగ్స్​ ద్వారా ‘accounts’ను యాక్సెస్ చేసి లాగిన్ చేసిన అకౌంట్ల సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
  2. పాత ఫోన్​లో ఫ్యాక్టరీ రీసెట్‌‌ను స్టార్ట్ చేయడానికి ముందు అది ఎన్‌క్రిప్ట్ చేసి ఉందో లేదో చెక్ చేయండి. ఒకవేళ ఎన్​క్రిప్ట్ ఎనేబుల్​ చేసి లేకపోతే.. ఫోన్ సెట్టింగ్స్​ ద్వారా ఎన్‌క్రిప్షన్‌‌ను ఎనేబుల్ చేయండి.
  3. పాత ఫోన్‌‌లోని ఫొటోలు, వీడియోలు, ఇతర మల్టీమీడియా కంటెంట్‌ను బ్యాకప్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ వంటి క్లౌడ్ స్టోరేజీ సొల్యూషన్‌లను వాడండి. క్లౌడ్ బ్యాకప్ సిస్టమ్ ద్వారా ఆ డేటాను రీస్టోర్ చేయడం ఈజీ.
  4. మీ పాత ఫోన్‌లోని గూగుల్‌లో వాట్సాప్ సెట్టింగ్స్​ ద్వారా చాట్ బ్యాకప్‌ను రెడీ చేసుకోండి. మీకు ఏయే ఫైల్స్ బ్యాకప్ కావాలో అందులో ఎంచుకోండి.
  5. పాత ఫోన్‌లోని ఫైల్స్​ బ్యాకప్‌ చేసుకోండి. ఎన్‌క్రిప్షన్‌‌ను ఎనేబుల్ చేయండి. ఇవన్నీ చేశాక  ఫ్యాక్టరీ రీసెట్‌ పూర్తి చేయండి. దీంతో ఫోన్‌లోని మొత్తం డేటా డిలీట్ అవుతుంది.
  6. మీ పాత ఫోన్‌లో మైక్రో ఎస్‌డీ కార్డ్‌లను వాడి ఉంటే.. వాటిని తీసుకోండి. తీయడానికి ముందు.. వాటిలో మీరు స్టోర్ చేసిన డేటా సేఫ్‌గా ఉందా లేదా తనిఖీ చేయండి.
  7. పాత ఫోన్ నుంచి మెసేజెస్, కాల్ రికార్డ్స్ డిలీట్ చేయండి. అవసరం అనుకుంటే వాటిని బ్యాకప్​ చేసుకోండి. మెయిల్​కు సెండ్​ చేసుకోండి.
  8.  పాత ఫోన్‌లోని అన్ని బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లను తప్పకుండా డిలీట్(Old Phone – Selling Tips) చేయండి.

Also Read: Free Bus Survices: మహిళలకు ఫ్రీ టికెట్..ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి?