Sora and Indians : టెక్స్ట్ ఆధారంగా వీడియోలను తయారు చేసే సాఫ్ట్‌వేర్ ‘సోరా’. దీన్ని అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’ తయారు చేసింది. ప్రస్తుతం ‘సోరా’ను మరింత బెటర్‌గా మార్చే ప్రయత్నాల్లో ఓపెన్ ఏఐ కంపెనీ ఉంది. ఈక్రమంలో భారత్‌కు చెందిన కళాకారులు, మూవీ డైరెక్టర్స్, క్రియేటివ్ వ్యక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వరల్డ్ క్లాస్‌లో సోరాను తీర్చిదిద్దనున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల అభిరుచులను అద్దంపట్టేలా, అవసరాలను తీర్చగలిగేలా సోరాను సమాయత్తం చేయనున్నారు. ఈమేరకు వివరాలతో ఓపెన్ ఏఐ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలా దేశాల ఆర్టిస్టులు, క్రియేటివ్ వ్యక్తుల నుంచి కూడా తాము ఫీడ్‌బ్యాక్‌ను సేకరిస్తున్నట్లు తెలిపింది.
Also Read :YouTube Auto Dubbing : ‘ఆటో డబ్బింగ్’.. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు సరికొత్త ఫీచర్
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోరా వర్షన్‌కు టెక్ట్స్‌ను అందిస్తే.. 20 సెకన్ల నిడివి కలిగిన 1080 పిక్సెల్స్ వీడియోలను తయారు చేసి అందిస్తుంది. చాట్ జీపీటీ ప్లస్ అకౌంటుకు అదనంగా సోరా ఫీచర్‌ను(Sora and Indians) అందిస్తున్నారు. సోరా ద్వారా ప్రతినెలా 480 పిక్సల్ వీడియోలు 50 దాకా, 720 పిక్సల్ వీడియోలు 40 దాకా తయారు చేయొచ్చు. అయితే అసాంఘిక కార్యకలాపాలు, పిల్లలు, మహిళలకు సంబంధించిన అసభ్యకర టెక్ట్స్‌ను సోరాకు అందిస్తే.. వీడియోలు తయారు చేయకుండా ఓపెన్ ఏఐ కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. ఫేక్ వీడియోలను తయారు చేయకుండా సోరాను తీర్చిదిద్దడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం రెడ్ టీమర్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌లు, కొందరు కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే సోరాను అందుబాటులోకి తెచ్చారు. విడతలవారీగా యూజర్లు అందరికీ సోరాను అందించే లక్ష్యంతో ఓపెన్ ఏఐ కంపెనీ ఉంది.మొత్తం మీద సోరా అనేది టెక్ట్స్ నుంచి వీడియోలను తయారు చేసే ఒక విప్లవాత్మక ఆవిష్కరణ అని చెప్పుకోవచ్చు.