E Scooter Fire: స్కూటర్లలో పేలుళ్లకు ప్రధాన కారణం ‘బ్యాటరీ సెల్స్’ .. ప్రాథమిక దర్యాప్తులో గుర్తింపు!!

మన దేశంలో ఇటీవల చాలా చోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోయాయి. ఇందుకుగల కారణాలను తెలుసుకునేందుకు అధ్యయనం జరిపిన భారత ప్రభుత్వం కొన్ని కీలక విషయాలను గుర్తించింది.

  • Written By:
  • Publish Date - May 9, 2022 / 08:00 PM IST

మన దేశంలో ఇటీవల చాలా చోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోయాయి. ఇందుకుగల కారణాలను తెలుసుకునేందుకు అధ్యయనం జరిపిన
భారత ప్రభుత్వం కొన్ని కీలక విషయాలను గుర్తించింది. బ్యాటరీల్లో తలెత్తిన లోపాల వల్లే ఎలక్ట్రిక్ స్కూటర్ల లో మంటలు చెలరేగాయని ప్రాథమికంగా తేల్చారు. ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ ఈవీ కంపెనీల ఈ-స్కూటర్లు కాలిపోయిన ఘటనలపై జరిపిన దర్యాప్తులో ఈవిషయం వెల్లడైంది. ఇందులో భాగంగా ఈ మూడు కంపెనీల నుంచి బ్యాటరీ సెల్స్ శాంపిళ్లను సేకరించి పరీక్షించారు.

ఓలా స్కూటర్లపై..

ఓలా స్కూటర్లలో బ్యాటరీ సెల్స్, బ్యాటరీ మ్యానేజ్మెంట్ సిస్టం (బీఎమ్ఎస్) లలో లోపాలు ఉన్నాయని దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఓలా కంపెనీ ఈ బ్యాటరీ సెల్స్ ను దక్షిణ కొరియాకు చెందిన LG ఎనర్జీ సొల్యూషన్ (LGES) అనే కంపెనీ నుంచి దిగుమతి చేసుకుంటోంది. పలు చోట్ల ఓలా స్కూటర్లలో మంటలు చెలరేగిన ఘటనలపై దర్యాప్తుకు ఆ కంపెనీ కూడా నిపుణుల కమిటీని నియమించింది. ఆయా ఘటనలకు గా మూల కారణాలను ఈకమిటీ ఇంకా గుర్తించలేదు. అయితే.. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ సెల్స్ లో, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టం లలో ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ కమిటీ నివేదిక మరో రెండు వారాల్లో విడుదలైతే .. ఎందుకు ఇలా జరుగుతోంది అనే దానిపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

ప్యూర్ ఈవీ, ఒకినవా..

ఒకినావా ఈ-స్కూటర్ల విషయానికి వస్తే.. వాటి బ్యాటరీ సెల్స్ లో, బ్యాటరీ మాడ్యుల్స్ లో సమస్య ఉందని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తులో గుర్తించారని అంటున్నారు. ప్యూర్ ఈవీ స్కూటర్ల లోని బ్యాటరీ కేసింగ్ సమస్య ఉన్నదని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఈ-స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసేముందు కంపెనీలు తప్పకుండా బ్యాటరీ సెల్స్ ను పరీక్షించాలనే నిబంధన పెట్టె దిశగా కేంద్ర ప్రభుత్వం యోచించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ-స్కూటర్ల బ్యాటరీ ప్యాక్ లను .. వాటి విడుదలకు ముందు పరిక్షిస్తోంది. ఒకవేళ బ్యాటరీ సెల్స్ ను కూడా తనిఖీ చేయాలని భావిస్తే .. అందుకోసం మరో యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.