Site icon HashtagU Telugu

Google’s New Feature : ఫోన్ల చోరీకి చెక్ పెట్టేలా గూగుల్ సరికొత్త ఫీచర్!

Factory Reset Protection

Factory Reset Protection

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) ఫోన్ చోరీలను అడ్డుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా విడుదల కానున్న ఆండ్రాయిడ్ 16 వర్షన్‌(Android 16 Version)లో “ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్” (Factory Reset Protection – FRP) ఫీచర్‌ను మరింత పటిష్టంగా మారుస్తోంది. ఇప్పటివరకు ఫోన్‌ రీసెట్ చేసిన తర్వాత అది తిరిగి ఉపయోగించుకునే అవకాశం ఉండేది. అయితే కొత్తగా వచ్చే FRP ఫీచర్ ద్వారా, అసలు యజమాని అనుమతి లేకుండా ఫోన్‌ను రీసెట్ చేస్తే, ఆ ఫోన్ పూర్తిగా పని చేయకుండా చేస్తారు. దీంతో దొంగలు ఫోన్‌ను అపహరించినా దానిని వినియోగించలేరు.

Neeraj Chopra: భార‌త జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా సరికొత్త రికార్డు!

ఈ కొత్త భద్రతా ఫీచర్‌ను 2025 చివర నాటికి అందుబాటులోకి తీసుకురావాలని గూగుల్ యోచిస్తోంది. ఇది ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ 16లో భాగంగా అందుబాటులోకి రానుంది. ఫోన్ యజమానుడి గూగుల్ అకౌంట్ ధృవీకరణ లేకుండా డివైస్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసినా అది తిరిగి యాక్టివేట్ కాకుండా చేయడమే ఈ ఫీచర్ ప్రధాన లక్ష్యం. దీంతో ఫోన్లను దొంగిలించడం ద్వారా వచ్చే నష్టం తగ్గిపోతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే చాలామంది యూజర్లు ఫోన్‌లు పోయినప్పుడు డేటా, గూగుల్ అకౌంట్ లాగిన్ వంటి విషయాల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ తీసుకువస్తున్న ఈ కొత్త ఫీచర్‌తో వారి భద్రతా ఆందోళనలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ఇకపై ఫోన్ కోల్పోతే దాన్ని అపరిచితులు ఉపయోగించలేరు కాబట్టి, దొంగలకు ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. టెక్నాలజీ ప్రపంచంలో ఇది ఒక బిగ్ స్టెప్‌గా చెబుతున్నారు.

Exit mobile version