Facebook Virus: డ్రాకేరిస్ తో జాగ్రత్త.. కొత్త మాల్వేర్ పై అప్రమత్తం చేసిన పేస్ బుక్..?

హ్యాకర్లు నిత్యం ఏదో ఒక విధంగా మొబైల్ ఫోన్లో లోకి రకరకాల మాల్వేర్లను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాగా

  • Written By:
  • Publish Date - August 16, 2022 / 07:30 AM IST

హ్యాకర్లు నిత్యం ఏదో ఒక విధంగా మొబైల్ ఫోన్లో లోకి రకరకాల మాల్వేర్లను ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాగా ఎక్కువగా యాప్ ల సహాయంతోనే ఫోన్ లలోకి మాల్వేర్లను ప్రవేశ పెడుతూ ఉంటారు. ఇందువల్ల ఒకసారి మాల్వేర్ ఆ ఫోన్ లోకి చొరబడింది అంటే ఆ ఫోన్లో ఉన్న సమాచారం అంతా కూడా వెంటనే హ్యాకర్లకు వెళుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా డ్రాకేరిస్ అనే ఒక మాల్వేర్ కూడా ఆండ్రాయిడ్ యూజర్ల పాలిట విలన్ లా ప్రవేశించింది అంటూ ఫేస్ బుక్ సంస్థ హెచ్చరికలను చేసింది.

ఈ డ్రాకేరిస్ అనే ఈ మాల్వేర్ ఫోన్ లో ప్రవేశిస్తే మన ఫోన్ లో ఉన్న వాట్సాప్, యూట్యూబ్ లను కనిపించకుండా మాయం చేస్తుందని వెల్లడించింది. అందువల్ల నకిలీ, థర్డ్ పార్టీ యాప్ ల పట్ల అత్త మొత్తంగా ఉండాలి అని ఫేస్ బుక్ సంస్థ తాజాగా సూచించింది. మరి ముఖ్యంగా ఈ గేమింగ్ యాప్ ల సహాయంతోనే డ్రాకేరిస్ మాల్వేర్ ను హ్యాకర్లు స్మార్ట్ ఫోన్ లోకి చొప్పిస్తున్నారు అంటూ ఫేస్ బుక్ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మాల్వేర్ ఫోన్ లోని యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ను కూడా ఏమార్చగలదట.

బిట్టర్ ఏపీటీ అనే హ్యాకింగ్ గ్రూప్ ఈ మాల్వేర్ యొక్క సృష్టికర్త అని వెల్లడించింది. యూజర్ అనుమతి లేకుండానే ఫోన్ లో ఏమైనా చేసేందుకు ఈ డ్రాకేరిస్ మాల్వేర్ దోహదపడుతుందని వివరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రొటెక్షన్ ఉన్న యాప్ లను మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోవాలని అలా కాకుండా థర్డ్ పార్టీ ఏపీకే సైట్ల నుంచి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోరాదని ఫేస్ బుక్ సంస్థ స్పష్టం చేసింది.