Smart Features In Facebook: ఫేస్‌ బుక్‌లో స్మార్ట్ ఫీచర్. అదేంటంటే..!

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు

  • Written By:
  • Updated On - July 27, 2022 / 10:14 AM IST

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా పేస్ బుక్ ఖాతాలను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక చాలామంది అయితే వేరే వేరే ఈ మెయిల్ లతో ఎక్కువ ఫేస్ బుక్ అకౌంట్ లని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ పేస్ బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ విషయానికి వస్తే బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, అలాగే పరిచయం ఉన్నవారితో పాటు పరిచయం లేని వారు కూడా ఫ్రెండ్స్ లిస్టులో ఉంటున్నారు. అయితే చాలామంది ఈ పేస్ బుక్ లో వాట్సాప్ మాదిరిగానే ఇష్టమైన ఫోటోలను వీడియోలను షేర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా ఫేస్ బుక్ లో పెట్టిన ఫోటోలు, వీడియోలు ఫ్రెండ్స్ అందరికీ కనిపిస్తాయి అని చాలామంది టెన్షన్ పడుతూ పెట్టడానికి వెనకాడుతూ ఉంటారు. అటువంటి సమయంలో చేస్తే వారిని అన్ ఫ్రెండ్ చేయాలి లేదంటే ఆ కాంటాక్ట్ లను బ్లాక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.

అయితే వాట్సాప్ లో మన స్టేటస్ ఎవరైతే చూడకూడదు అనుకుంటామో వారి నెంబర్లను ప్రైవసీలో పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఫేస్ బుక్ లో కూడా ఆ ఆప్షన్ ఉంటే బాగుంటుంది అని చాలామంది బావించారు. అయితే ఫేస్ బుక్ లో కూడా కేవలం కావాల్సిన వారికి కావాల్సిన పోస్టులే కనిపించేలా చేసుకునే వెసులుబాటును త్వరలోనే ఫేస్ బుక్ సంస్థ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఫేస్ బుక్ లో ఒకే ప్రొఫైల్ కు అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి కేవలం పరిచయస్తుల దాకా ఫ్రెండ్ అయిన వారందరికీ అదే కనిపిస్తుంది. కొంతమంది ఇలా చేస్తుండగా, మరి కొంతమంది మాత్రం ఎక్కువ సంఖ్యలో ఫేస్ బుక్ ఖాతాలను క్రియేట్ చేసుకుని వేర్వేరుగా స్నేహితులను మెయింటైన్ చేస్తూ ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే అలా కాకుండా ఒకే అకౌంట్ లో ఐదు వరకు ప్రొఫైల్స్ ను ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు ఫేస్ బుక్ ఏర్పాట్లు చేస్తోంది.

పేస్ బుక్ వినియోగదారులకు ఒకే ఫేస్ బుక్ ఖాతాలో వారి అవసరాలకు తగిన విధంగా వేర్వేరు ప్రొఫైల్స్ ను ఏర్పాటు చేసుకునే సదుపాయాన్ని తీసుకురానుంది. అయితే ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉందని ఫేస్ బుక్ యాజమాన్య సంస్థ మెటా ప్రతినిధి వెల్లడించారు. వినియోగదారులు ఒకే ఖాతాలో ఐదు వరకు వేర్వేరు ప్రొఫైల్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో అకౌంట్ కు అనుసంధానంగా ఉండే ప్రధాన ప్రొఫైల్ ఒకటి, నాలుగు అదనపు ప్రొఫైల్స్ ఉంటాయి. అదనపు ప్రొఫైల్స్ కు వినియోగదారులు తమకు నచ్చిన పేర్లను పెట్టుకోవచ్చు. అకౌంట్ కు లింక్ అయి ఉండే ప్రధాన ప్రొఫైల్ లో ఇప్పుడున్నట్టుగానే యూజర్ కు సంబంధించిన అసలైన వివరాలను యాడ్ చేసుకోవచ్చు. అదనపు ప్రొఫైల్స్ లో ఈ వివరాలేమీ కనబడవు, సదరు వినియోగదారుడి అసలైన సమాచారమేదీ అదనపు ప్రొఫైల్స్ కు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు ఆప్షన్లను మార్చుకోవడం ద్వారా ఫేస్ బుక్ ప్రొఫైల్స్ మధ్య విహరించవచ్చు. అదనపు ప్రొఫైల్స్ అయినా సరే ఇష్టం వచ్చినట్టుగా నంబర్లు, స్పెషల్ క్యారెక్టర్లతో పేర్లు పెట్టుకోవడం కుదరదని, అన్ని రూల్స్ పాటించాల్సిందేనని ఫేస్ బుక్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.