Site icon HashtagU Telugu

3D Avatars: ఇన్ స్టాగ్రామ్ లో తొలిసారిగా 3డీ అవతార్ లు.. ఫేస్ బుక్, మెసెంజర్ లలోనూ మరిన్ని జోడింపు !

Meta 3d Avatar

Meta 3d Avatar

మీరు ఫేస్ బుక్ , మెసెంజర్, ఇన్ స్టాగ్రామ్ యాప్ లను వాడుతారా ? అయితే ఇక మీ మెసేజింగ్ మరింత క్రియేటివ్ గా మారుతుంది. గతంలో ఫేస్ బుక్ , మెసెంజర్ యాప్ లలో అందుబాటులోకి తెచ్చిన 3డీ అవతార్ లను అప్ డేట్ చేసి, చాలావరకు కొత్త వాటిని చేర్చినట్లు మెటా (ఫేస్ బుక్) వెల్లడించింది.

తొలిసారిగా ఇన్ స్టాగ్రామ్ లోనూ వినియోగదారులకు 3డీ అవతార్ లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని నెటిజన్లు తమతమ ఆహార్యం, ముఖ కవళికలు, వస్త్రధారణ, రంగు వంటి వాటి ప్రకారం సెట్ చేసుకోవచ్చని తెలిపింది.

పిల్లలు, యువతులు, యువకులు, వృద్ధులు ఇలా ప్రతి వయసు వారు తమ లుక్ కు అనుగుణంగా 3డీ అవతార్ లు తయారు చేసుకోవచ్చని మెటా వివరించింది. వికలాంగులు, బధిరులకు అనుగుణంగా ఉండే 3డీ అవతార్ లు కూడా ఉంటాయని చెప్పింది. 3డీ అవతార్ లను డైరెక్ట్ మెసేజ్ లు పంపేందుకు, ఇన్ స్టాగ్రామ్ స్టోరీ గా పెట్టుకునేందుకు, స్టిక్కర్లుగా వాడేందుకు, ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్చర్ గా చేసుకునేందుకు, ఫీడ్ పోస్ట్ లలో షేర్ చేసేందుకు వాడుకోవచ్చని మెటా తెలిపింది.