Site icon HashtagU Telugu

Aadhaar: ఆధార్ విషయంలో ఇకపై నో టెన్షన్.. స్మార్ట్‌ఫోన్ ఆ ఆప్ ఉంటే చాలు.. ఇకపై ఆ సమాచారం మరింత భద్రం!

Aadhaar Card

Aadhaar Card

మాములుగా ఏదైనాజర్నీ చేసినప్పుడు గాని హోటల్స్ లో, కాలేజీలో అలాగే ఇంకా చాలా ప్రదేశాలలో గుర్తింపు కోసం ఆధార్ కార్డు స్టాప్ ని లేదా హార్డ్ కాపీని అడిగేవారు. కానీ ఇకమీదట ఆ అవసరం లేదు అంటుంది యూఐడీఏఐ. ఈ విషయంలో ఆధార్ కార్డు వినియోగదారులకు ఉపశమనాన్ని అందిస్తూ ఆధార్ కార్డుకు స్మార్ట్ ఫేస్ ప్రామాణీకరణ ఫీచర్‌ను జోడించింది. మీ స్మార్ట్‌ ఫోన్ సహాయంతో మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా మీ ఆధార్ కార్డు గుర్తిస్తుందట. అలాంటి సమయంలో మీరు సాఫ్ట్‌ కాపీని అందించాల్సిన అవసరం ఉండదని, దీనివల్ల ఆధార్ ను ఏమైనా చెడు వినియోగాల కోసం ఉపయోగిస్తారేమో అన్న భయం కూడా ఉండదని చెబుతోంది.

ఆధార్ ప్రామాణీకరణ చాలా సులభం అవుతుందట. మీరు యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే విధానం కూడా సులభతరం అవుతుందట. అంతేకాకుండా మీరు ఆధార్‌ ను ధృవీకరించవచ్చని, యూపీఐ లావాదేవీలకు స్మార్ట్‌ ఫోన్ అవసరమైనట్లే, ఆధార్ ప్రామాణీకరణకు కూడా స్మార్ట్‌ఫోన్ చాలా అవసరం అని చెబుతున్నారు. కాగా యూఐడీఏఐ స్మార్ట్ ప్రామాణీకరణ ఫీచర్‌ తో మీ వ్యక్తిగత సమాచారం అందరికీ అందుబాటులో ఉండదట. ఈ విషయంలో మీకు మరింత ప్రైవసీ లభిస్తుందని చెబుతున్నారు. ఆధార్ కార్డు స్మార్ట్ ప్రామాణీకరణతో ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డు కాపీని హార్డ్, సాఫ్ట్ కాపీలలో ఇవ్వాల్సిన అవసరం లేదట.

అయితే ఇందుకు బదులుగా స్మార్ట్‌ఫోన్ సహాయంతో మీ ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆధార్ నంబర్‌ ను ధృవీకరించవచ్చట. అయితే ఇంతకీ ఈ ఫేస్ ప్రామాణికరణ ఎలా పనిచేస్తుంది అన్న విషయానికొస్తే.. ఆధార్ కార్డు ముఖ ప్రామాణీకరణను ఉపయోగించడానికి మీరు మీ స్మార్ట్‌ ఫోన్‌ లో కొత్త ఆధార్ యాప్‌ ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని తరువాత అనుసరించాల్సిన దశలను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని అయినా స్కాన్ చేయడం ద్వారా ఆధార్‌ ను ధృవీకరించవచ్చట. దీనిలో సంబంధిత వ్యక్తి గురించి ముఖ్యమైన సమాచారం మీ స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్‌ పై కనిపిస్తుందట. దానిని మీరు ధృవీకరించవచ్చట. ఆధార్ కార్డు ముఖ ప్రామాణీకరణ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ వెర్షన్‌ లో అందుబాటులో ఉందని, సామాన్యులు దీన్ని ఉపయోగించడానికి కొంచెం వేచి ఉండాల్సి రావచ్చని ఇది త్వరలోనే పూర్తిస్థాయిలో అందరికీ కూడా అందుబాటులోకి రానుందని యూఐడీఏఐ తెలిపింది.