Site icon HashtagU Telugu

God Chip : ప్రపంచాన్ని మార్చేసే ‘గాడ్  చిప్‌‌’.. ఏం చేస్తుందో తెలుసా ?

Microsoft Majorana 1 God Chip Quantum Computing Quantum Computers Qubits

God Chip : ‘గాడ్‌ చిప్‌’ వచ్చేసింది. అపర కుబేరుడు బిల్‌గేట్స్‌కు చెందిన మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తీసుకొచ్చిన ఈ గాడ్ చిప్ అసలు పేరు మయోరానా-1.  ఇంతకీ ఏమిటిది ? దీన్ని గాడ్ చిప్ అని ఎందుకు పిలుస్తున్నారు ? ఇది చేసే పని ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Weekly Horoscope : వారఫలాలు.. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

ఏమిటీ గాడ్  చిప్‌‌ ? 

ప్రస్తుతం సాధారణ కంప్యూటర్లతో పాటు సూపర్ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సూపర్ కంప్యూటర్లను మించిన స్పీడుతో పనిచేసే కెపాసిటీ క్వాంటమ్‌ కంప్యూటర్ల సొంతం. ఈ కంప్యూటర్లు అందుబాటులోకి రావడానికి ఇంకో 20 ఏళ్ల టైం పట్టొచ్చు. క్వాంటమ్ కంప్యూటర్లు పనిచేయాలంటే ప్రత్యేకమైన చిప్‌లు కావాలి. క్వాంటమ్ కంప్యూటర్లు క్యూ బిట్ల ప్రాతిపదికన పనిచేస్తాయి.  ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన  గాడ్ చిప్‌ మయోరానా-1లో క్యూ బిట్‌లే ఉంటాయి. ఈ చిప్‌లో కనీసం 10 లక్షల క్యూబిట్లను అమరిస్తే, అది క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం పనికొస్తుంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ పరిశోధన తర్వాత  టోపోకండక్టర్స్‌ అనే కొత్త రకం పదార్థం అందుబాటులోకి వచ్చింది. దానితోనే గాడ్  చిప్‌(God Chip)ను తయారు చేశారు. టోపోకండక్టర్‌ అనే పదార్థంతో తయారయ్యే క్యూబిట్లు వేగంగా, విశ్వసనీయంగా పనిచేస్తాయి. వాటి సైజు కూడా మిల్లీమీటరులో వందోవంతు మాత్రమే. క్యూబిట్లు లోపం లేకుండా పనిచేయడానికి మైనస్‌ 270 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత అవసరం. త్వరలోనే 10 లక్షల క్యూబిట్లతో కూడిన క్యూబిట్‌ ప్రాసెసర్‌‌ను తయారు చేస్తామని మైక్రోసాఫ్ట్ కంపెనీ అంటోంది.

Also Read :7 Planets Parade: ఫిబ్రవరి 28న ఒకే వరుసలో సప్తగ్రహాలు.. ఎలా చూడాలి ?

2025 డిసెంబరులో వస్తోంది.. ‘విల్లో’ 

ఈ తరహా సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ చిప్‌ల తయారీ విషయంలో గూగుల్ కూడా ముందంజలోనే ఉంది. ఈ ఏడాది  డిసెంబరులో ‘విల్లో’ పేరుతో గూగుల్‌ తన క్వాంటమ్‌ చిప్‌‌ను విడుదల చేయబోతోంది. ఇది కీలకమైన కంప్యూటేషన్లను కేవలం 5  నిమిషాల్లోనే చేయగలదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సూపర్ కంప్యూటర్లు కోట్ల సంవత్సరాల్లో చేయగలిగే లెక్కలను.. కేవలం 5 నిమిషాల్లో చేయగలగడం ‘విల్లో’ ప్రత్యేకత అని గూగుల్ చెబుతోంది.

నిత్య జీవితంపై ప్రభావం ఏమిటి ?