OnePlus : మార్కెట్లోకి విడుదల అయినా సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

మరి ఆ కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తాజాగా వన్ ప్లస్ బ్రాండ్ OnePlus 12 ను లాంచ్ చేసింది.

  • Written By:
  • Publish Date - December 13, 2023 / 06:20 PM IST

OnePlus : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ ఫోన్లకు మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే వాటిలో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కూడా ఒకటి. ఈ బ్రాండ్ నుంచి ఎప్పుడెప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతాయా అని వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇకపోతే ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన వన్ ప్లస్ సంస్థ తాజాగా మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. మరి ఆ కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. తాజాగా వన్ ప్లస్ బ్రాండ్ OnePlus 12 ను లాంచ్ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ స్మార్ట్ ఫోన్ ని ప్రస్తుతం చైనాలో లాంచ్ చేసింది. వచ్చే ఏడాది జనవరిలో భారత్ తో పాటు ఇతర మార్కెట్లో కూడా ఈ స్మార్ట్ఫోన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు గ్రీన్ కలర్, రాక్ బ్లాక్, వైట్ కలర్ వంటి కలర్స్ లో లభించనుంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన ఫీచర్ల విషయానికి వస్తే.. OnePlus 12 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ColorOS 14పై రన్ అవుతుంది. 6.82-అంగుళాల క్వాడ్-HD+ LTPO OLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 24జీబీ LPDDR5X ర్యామ్‌తో స్నాప్ డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ తో వచ్చింది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో సోనీ LYT-808 సెన్సార్‌తో కూడిన 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 64ఎంపీ టెలిఫోటో కెమెరా, 48ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 32ఎంపీ కెమెరాను అందించారు..వన్ ప్లస్ 12 గరిష్టంగా 1టీబీ UFS 4 స్టోరేజ్ కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా, ఫోన్ 5జీ, 4జీ LTE, వైఫై 7, బ్లూటూత్ 5.4, జీపీస్, NFC, USB టైప్-సి పోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే భద్రత కోసం ఈ ఫోన్‌లో అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా జత చేశారు.

ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5,400mAh. 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్ అందించబడింది. అంతేకాకుండా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. డెస్ట్ అండ్ వాటర్ ఫ్రూఫ్ కోసం ఫోన్ IP65 రేట్ చేయబడింది. వన్ ప్లస్ 12 12జీబీ + 256జీబీ వేరియంట్ కోసం ప్రారంభ ధర చైనా 4,299 యువాన్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ. 50,700 గా ఉండనుంది. టాప్ 24జీబీ + 1టీబీ ఫోన్ ధర CNY 5,799 అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 68,400 గా నిర్ణయించబడింది. ఫాస్ట్ ఛార్జింగ్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వైర్లెస్ ఛార్జింగ్ 50W సపోర్ట్ తో వచ్చింది.

Also Read:  Aadhaar Free Update: ఆధార్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. మరోసారి ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు!