Site icon HashtagU Telugu

BYD YangWang U9: మార్కెట్ లోకి సూపర్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ కార్.. రన్నింగ్ లో టైర్ పేలినా కూడా ఏమి కాదట?

Byd Yangwang U9

Byd Yangwang U9

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాలకి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆయా కంపెనీలు మార్కెట్లోకి రకరకాల ఎలక్ట్రిక్ వాహనాలు విడుదల చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్ షాంఘై ఆటో షోలో తన కొత్త ఆల్ ఎలక్ట్రిక్ సూపర్‌కార్ యాంగ్‌వాంగ్ యూ9 కారుని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కారు పరిచయంతో పాటుగా, కంపెనీ ఒక సంచలనాత్మక సాంకేతికతను కూడా ప్రదర్శించింది. దీనిని Disus-X అధునాతన సస్పెన్షన్ సిస్టమ్ అని పిలుస్తున్నారు.

ఈ కారు మూడు చక్రాల తో కూడా రోడ్డుపై ప్రయాణించగలదు. బిల్డ్ యువర్ డ్రీమ్ వేదికపై యాంగ్ వాంగ్ యూ9 ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టారు. ఇది Mercedes-Benz GLE ఎయిర్ సస్పెన్షన్‌లో కనిపించే విధంగా ఉంటుంది. అయితే, బిల్డ్ యువర్ డ్రీమ్ సూపర్‌కార్‌లో ఉపయోగించినది మరింత అధునాతనమైన ఫీచర్ అని చెబుతున్నారు. కారు ఫ్రంట్ రైడ్ వైపు చక్రం లేకపోయినా, కారు చాలా సాఫీగా నడుస్తుందట. Disus-X సస్పెన్షన్ సిస్టమ్‌లో ఇంటెలిజెంట్ డంపింగ్ బాడీ కంట్రోల్ సిస్టమ్, ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బాడీ కంట్రోల్ సిస్టమ్, ఇంటెలిజెంట్ ఎయిర్ బాడీ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ సూపర్‌కార్‌కి ఆల్ రౌండ్ కంట్రోల్‌ని అందిస్తాయి.

కారు ముందు చక్రం పాడైపోయినా లేదా టైర్ కూడా పగిలినా, ఈ సస్పెన్షన్ సిస్టమ్ కారును కొద్దిగా ముందువైపుకు వంచుతుంది. దీని కారణంగా బ్రేక్ రోటర్లు రోడ్డును తాకవు. కారు ఎటువంటి సమస్య లేకుండా సాధారణంగా కదులుతుంది. సిస్టమ్ బాడీ రోల్‌ను తగ్గించగలదని, రోల్‌ ఓవర్ ప్రమాదాన్ని తగ్గించగలదు. అత్యవసర బ్రేకింగ్‌లో సహాయపడుతుందని కార్‌ మేకర్స్ కూడా ప్రకటించారు. Disus-X సస్పెన్షన్ సిస్టమ్ ఆటోమేకర్ ఇంటెలిజెంట్ డంపింగ్, హైడ్రాలిక్, ఎయిర్ బాడీ కంట్రోల్ సిస్టమ్‌లను ఉపయోగిస్తుంది. కాగా ఈ కారు కేవలం 2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అలాగే, ఈ కారు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 700 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తోంది.

Exit mobile version